.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1176 లో......రాజు వెళ్లిపోతుంటే ఎందుకు ఆపలేదు.. వాడు ఈ ఇంటి వారసుడని చెప్పుంటే ఆ రేఖ నోరు మూసేది కదా అని అపర్ణ తన తల్లితో అంటుంది. ఇప్పుడే మనిద్దరం వెళ్లి రాజుని పెళ్లికి ఒప్పిద్దామని మనవరాలిని లాక్కెళ్తుంది. అయితే గుమ్మం దగ్గర రేఖ నిలబడి ఇద్దరిని అడ్డుకుంటుంది. టీవీలో భ్రమరాంబతో దుగ్గిరాల కుటుంబం పరువు తీసేస్తానని బెదిరించడంతో ఇందు షాక్ అవుతుంది. నేను ఎక్కడికీ రాను.. ఈ కుటుంబానికి నా వల్ల మచ్చ రావడం నాకు ఇష్టం లేదని ఇందు తేల్చేస్తుంది. ఇందూని వదిలి వచ్చేయడంతో రాజ్ ఒంటరిగా బాధపడుతుంటాడు. ఇంతలో లక్కీ వచ్చి క్షమాపణలు చెప్తాడు. నీ కోసం నేను ఎంతో చేస్తే నువ్వు వెన్నుపోటు పొడిచావని, నీ ముఖం చూడనంటూ రాజ్ తలుపులు మూసేసి వెళ్లిపోతాడు.
తన చేతికి ఇంటి పెత్తనం తిరిగి రావడంతో రేఖ తాళాలు ఊపుతూ స్టైల్‌గా వస్తుంది. చిటికె వేయగానే పనిమనిషి వచ్చి అందరికి కాఫీలు ఇస్తుంది. ఇప్పుడు ఈ ఇల్లు నీ కంట్రోల్లోనే ఉందని భ్రమరాంబ చెప్తుంది. వాడి బెస్ట్ ఫ్రెండే ఆ రాజుగాడి పాలిట రాహువులా మారాడని భూషణ్ అంటాడు. రాజు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నా ఇందూ మౌనంగా ఎందుకు ఉందని శేషం అనుమానం వ్యక్తం చేస్తాడు. తన మౌనానికి మీనింగ్ వేరే ఉందని, కంపెనీ నాశనం అయిపోతోందని ఇందు బాధపడుతోందని రేఖ కవర్ చేస్తుంది. ఇకపై నేను ఆడుతున్న గేమ్ చూడండి.. ఇందూకి పెళ్లి చేయబోతున్నానని రేఖ చెప్తుంది. తాళి కట్టే సమయానికి రాజు రాకుండా ఉంటాడా అని శేషం ప్రశ్నిస్తే, నన్ను దాటి ఇందూ మెడలో ఎవరు తాళి కడతాడో చూస్తానని రేఖ సవాల్ చేస్తుంది.
ఇందూ గురించి బాధపడుతున్న రాజుని చూసి చలపతి, లక్ష్మీలు బాధపడతారు. వాడేం తినడం లేదు, ఏం తాగడం లేదు, ఏదో కోల్పోయానన్న బాధ వాడి మనసులో స్పష్టంగా కనిపిస్తోందని లక్ష్మి అంటుంది. ఇన్నాళ్లూ ఇందూతో ఉన్నాడు కదా, మరిచిపోవడం కష్టమేనని చలపతి చెప్తాడు. రాజు మన బిడ్డే కాదు, వాడి జీవితంలో ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారని లక్ష్మీ నిలదీస్తుంది. వాడిని అక్కడే వదిలేసి నేరుగా ఇంటికి వచ్చేవాడిని అని చలపతి అంటాడు. కానీ వాడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కమాట కూడా అనలేదని లక్ష్మీ చెప్తుంది. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసని చలపతి నచ్చచెప్తాడు. రాజు దగ్గరికి వెళ్లి పాలు ఇవ్వగా వద్దని కోపంగా వెళ్లిపోతాడు.
ఉదయాన్నే రేఖ వచ్చి అపర్ణకి ఒక అబ్బాయి ఫోటో చూపించి ఇందూకి కాబోయే భర్త అని చెప్తుంది. ఇందూకి మంచి జీవితం ఇవ్వడం మన బాధ్యత, అందుకే తన అత్తగా నేనే బాధ్యత తీసుకున్నానని అంటుంది. ఆలస్యం చేయకుండా పెళ్లి చేయకపోతే ఆస్తుల విషయంలో ప్రమాదం జరుగుతుందని చెప్తుంది. ఈ అబ్బాయి గురించి బాగా ఎంక్వైరీ చేశాను, ఈ రోజే పెళ్లిచూపులకు వస్తున్నారని అంటుంది. తనకి పెళ్లి చేయడానికి నువ్వెవరని అపర్ణ ఫైర్ అవుతుంది. నువ్వు పెళ్లి చూపులకు రెడీయా అని రేఖ అడగ్గా రెడీ అవుతానని ఇందు అనడంతో అపర్ణ షాక్ అవుతుంది. ఇందూ రెడీ అవుతుండగా ఐశ్వర్య వచ్చి క్యారెక్టర్ లేదని అవమానిస్తుంది. దానికి ఇందూ.. నా మెడలో తాళి కట్టేది బావనే, 7 సముద్రాల వెనుక ఉన్నా సరే బావ నా కోసం వచ్చి తాళి కడతాడు, మమ్మల్ని ఎవరూ విడదీయలేరని ఘాటుగా సమాధానమిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

