Home

»

Tv News

Brahmamudi: రాజ్ ప్రవర్తనపై ఇందుకి అనుమానం.. సిరి గురించి భ్రమరాంబ తెలుసుకుంటుందా!

Sep 26, 2026 10:49AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 1146లో.. సిరితో ఆట ఆడుతూ ఆమె నుంచి తనకు కావాల్సిన విషయాలు రాబట్టాలని భ్రమరాంబ ప్రయత్నిస్తుంది. అయితే సిరి మాత్రం చిన్నపిల్లలా ప్రవర్తిస్తూ భ్రమరాంబను ఆటపట్టిస్తుంది. ఈ క్రమంలో సిరి చేసిన పనితో భ్రమరాంబకు చెంపదెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఆమె అన్నం కూడా తినలేని స్థితిలో పడిపోతుంది. భ్రమరాంబ పరిస్థితిని చూసిన శేషు మాత్రం తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఆమెను మరింత ఇబ్బంది పెడతాడు. సిరిని మాటల్లో పెట్టి ఆమె గతాన్ని తెలుసుకోవాలని వేసిన ప్లాన్ ఇలా బెడిసికొట్టడంతో భ్రమరాంబకు చిరాకు వస్తుంది. అయినా సిరి నుంచి ఏదో ఒక విధంగా నిజాలు రాబట్టాలని ఆమె ప్రయత్నిస్తూనే ఉంటుంది. మరోవైపు ఇంట్లో జరిగిన విషయాలపై అపర్ణ కూడా భ్రమరాంబను తిడుతుంది.

 

ఇదిలా ఉంటే సిరి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని రాజు, ఇందు నిర్ణయించుకుంటారు. రేఖ కంటే ముందే సిరి కుటుంబం గురించి తెలుసుకోవాలని ఇందు భావిస్తుంది. గతంలో సిరికి జరిగిన యాక్సిడెంట్‌కు సంబంధించిన బండి నంబర్ ఆధారంగా ఆమె కుటుంబాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తారు. ఇందు తనకు తెలిసినవారి ద్వారా ఆ బండి వివరాలను సేకరించి, సిరి కుటుంబానికి సంబంధించిన అడ్రస్‌ను తెలుసుకుంటుంది. అడ్రస్ దొరకడంతో రాజు, ఇందు అక్కడికి వెళ్లి సిరి కుటుంబం గురించి ఆరా తీయాలని నిర్ణయించుకుంటారు. సిరి తల్లిదండ్రులు ఎవరు.. ఆమె గతం ఏంటి.. రాజుతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటనే విషయాలు తెలుసుకోవాలని ఇద్దరూ ప్రయత్నిస్తారు. అయితే ఈ విషయం రేఖకు తెలియకముందే సిరి గురించి పూర్తి నిజాన్ని తెలుసుకోవాలని రాజు, ఇందు అనుకుంటారు. దీంతో సిరి గతం మరోసారి కథలో కీలకంగా మారుతుంది. మరోవైపు రాజు విషయంలో ఇందుకు కూడా కొన్ని అనుమానాలు వస్తాయి. సిరి గురించి ఏదో విషయం రాజు తన దగ్గర దాచిపెడుతున్నాడని ఆమెకు అర్థమవుతుంది. ఇంతకుముందు అపర్ణ కూడా ఇదే విషయంపై రాజును నిలదీసింది. సిరి ఎవరు, ఆమెకు రాజుతో ఉన్న సంబంధం ఏంటని అపర్ణ అడిగినా సరైన సమయంలో అన్ని నిజాలు తెలుస్తాయని రాజు సమాధానమిస్తాడు. ఇందును జీవితాంతం కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటానని మాట ఇవ్వడంతో అపర్ణ మాములు అవుతుంది.

 

ఇక రేఖ, భ్రమరాంబ, భూషణ్, శేషులు సిరి ద్వారా నిజాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. సిరికి గతం పూర్తిగా గుర్తులేకపోవడంతో ఆమె నుంచి నిజాలు రాబట్టడం అంత సులభం కాదని వాళ్లకు అర్థమవుతుంది. అయినా సిరి తల్లిదండ్రులను గుర్తిస్తే ఆమె గతం బయటపడుతుందని భావించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడతారు. ఈ క్రమంలో శేషు తనదైన సెటైర్లతో అందరినీ ఆటపట్టిస్తూనే ఉంటాడు. మొత్తానికి సిరి కుటుంబం గురించి ఇందు, రాజులకు కీలకమైన సమాచారం దొరకడం, మరోవైపు సిరి నుంచి నిజాలు రాబట్టేందుకు భ్రమరాంబ ప్రయత్నిస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Brahmamudi, Brahmamudi Episode 1146, Star Maa Serial, Siri, Indu, Raju, Bhramaramba, Rekha, Sheshu, Siri Family, Siri Past]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com