Home

»

Tv News

Brahmamudi :కిడ్నాప్ నుంచి తప్పించుకున్న సిరి.. దుగ్గిరాల ఇంటికి పోలీసులు!

Oct 2, 2026 10:17AM

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1151 లో....కిడ్నాప్ చేసిన సిరిని డ్రైవర్ ఎక్కడో వదిలేసి వెళ్లిపోవడంతో "మొగుడా మొగుడా" అంటూ ఏడుస్తూ ఓ చోట కూర్చుంటుంది. చాలా సేపటి నుంచి ఆమెను గమనిస్తున్న ఓ ఆటో డ్రైవర్ దగ్గరకు వచ్చి నీళ్లు తాగమని బుజ్జగిస్తాడు. నాకు నీళ్లొద్దు నాకు మొగుడు కావాలని సిరి ఏడుస్తుంటే నీ మొగుడు నాకు బాగా తెలుసు.. తీసుకెళ్తానని నమ్మించి ఆటో ఎక్కించుకుంటాడు. తను ఇంటి దగ్గర దాగుడుమూతలు ఆడుతూ కారు డిక్కీలో దాక్కున్నానని కారు ఇక్కడికి వచ్చేసిందని సిరి అమాయకంగా చెప్తుంది.

మరోవైపు రాజ్, ఇందు సిరి కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. రాజ్ కారు డ్రైవర్ కి ఫోన్ చేసి నిలదీయడంతో భయపడి.. పటాన్ చెరు దగ్గర డిక్కీ తెరిస్తే అమ్మాయి బయటకు వచ్చింది, అక్కడే దింపేశానని చెప్తాడు. రాజ్ ఫైర్ అవ్వడంతో లొకేషన్ పెట్టడానికి ఒప్పుకుంటాడు. రాజ్, ఇందు అక్కడికి వెళ్లేసరికి సిరి అక్కడ లేదు. తను చిన్నపిల్లే, గతం మర్చిపోయిందని రాజ్ చెప్పడంతో డ్రైవర్ భయపడి వెళ్లిపోతాడు. రాజ్, ఇందు ఆ ఏరియాలోనే చెరోవైపు వెతకడం మొదలుపెడతారు. ఇంతలో ఆటో డ్రైవర్ సిరిని తన ఇంటికి కాకుండా రౌడీలు ఉన్న ప్లేస్ కి తీసుకెళ్తాడు. ఫోన్ లో.. అందమైన అమ్మాయి దొరికింది, మీడియేటర్ కి అమ్మేస్తే డబ్బులు వస్తాయని మాట్లాడటం సిరి వింటుంది.

నా మొగుడు ఏడి అని సిరి గోల చేయడంతో ముగ్గురు కలిసి ఆమెను పట్టుకుని కొడతారు. అరిచావంటే చంపేస్తానని బెదిరిస్తారు. దీంతో సిరి తెలివిగా రౌడీ చేయి కొరికి అక్కడి నుంచి పారిపోతుంది. రౌడీలు ఆమె వెంటపడతారు. సిరి బస్సు చాటున దాక్కుంటూ తప్పించుకుంటూ తిరుగుతుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో రేఖ తన ప్లాన్ ప్రకారం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. నేను ఆల్రెడీ పోలీసులకు చెప్పాను.. ఇంకాసేపట్లో ఇంటికి వస్తారు.. అప్పుడు రాజు నిజాలన్నీ చెప్పేస్తాడని భ్రమరంతో చెప్తుంది. ఇందు పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీదకు మార్చుకోవాలని రేఖ ప్లాన్ వేసుకుంటుంది. శేషు మాత్రం.. సిరికి ఏ ఆపదా రాకుండా నువ్వే కాపాడాలి స్వామి అని దండం పెట్టుకుంటాడు.

అపర్ణ ఇందుకి ఫోన్ చేసి.. సిరి దొరికిందా.. పోలీసులకు చెప్పండి అని కంగారుపడుతుంది. కానీ ఇందు.. వద్దు నానమ్మా, మేమే వెతికి తీసుకొస్తామని అంటుంది. ఎందుకంటే పోలీసులకు చెబితే బావ యాక్సిడెంట్ చేసి సిరి వాళ్ల నాన్న చనిపోయిన విషయం బయటకు వచ్చి బావ జైలుకు వెళ్తాడని ఇందు భయం. రాజ్ మాత్రం.. ఎవడైనా కిరాతకుడి చేతిలో పడితే తన జీవితం నాశనం అవుతుంది.. పోలీసులకు ఫిర్యాదు చేద్దామని అంటాడు. చివరికి ఇద్దరు మళ్లీ వెతకడం మొదలుపెడతారు. తరువాయి భాగంలో పోలీసులు దుగ్గిరాల ఇంటికి వచ్చి.. మీ మనవడు ఎక్కడ, సిరి ఎవరు, మీ మనవడికి ఆమెకు సంబంధం ఏంటని అపర్ణను ప్రశ్నిస్తారు. అప్పుడే రాజ్, ఇందు కలిసి సిరిని తీసుకుని ఇంటికి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Brahmamudi Serial Today October 1st Episode, Brahmamudi Siri Kidnap, Raj Indhu Search Siri, Rekha Police Complaint]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com