Home

»

Tv News

Brahmamudi : ఐశ్వర్య టెండర్ దక్కించుకుంటుందా.. ఇందు, రాజు ఏం చేయనున్నారు!

Oct 20, 2026 10:28AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1166 లో.... పవర్స్ లాక్కోవడంపై ఇందుతో గొడవ పడుతుంది ఐశ్వర్య. నాకు నచ్చినట్లుగా పవర్స్ ఇస్తారా లేదా నా నిర్ణయం నేను తీసుకోనా అని కడుపులో బిడ్డను తీయించుకుంటానని బెదిరిస్తుంది. నువ్వు చెప్పావనేగా కడుపులో బిడ్డను ఉంచుకున్నానుగా అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. దానికి ఇందు నీకు పవర్స్ ఇస్తాను కానీ నువ్వు ఏ తప్పు చేయవనే నమ్మకం నాకు కలగాలని కండిషన్ పెడుతుంది. ఆ నమ్మకం కలగాలంటే జీఆర్ గ్రూప్ వాళ్ల టెండర్ సాధించాలని ఫిట్టింగ్ పెడుతుంది ఇందు. దానికి ఐశ్వర్య ఓకే చెప్పి వెళ్లిపోతుంది.

మరోవైపు రాజ్, ఇందులను కలిపేందుకు తాత సుభాష్, అపర్ణ రొమాంటిక్ ఐడియా వేస్తారు. ఇందు రాగానే సైగ చేస్తాను. నువ్వు గన్ పట్టుకుని ఉండు.. రాజు రాగానే గన్ పడేసి బెలూన్ పేల్చు, పువ్వులు ఇందు మీద పడతాయని అపర్ణ ప్లాన్ చెప్తుంది. కానీ ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. పైన బెలూన్ ను చూసి ఇందు ఇదంతా మీ ప్లానా అని పసిగడుతుంది.సరిగ్గా అప్పుడే ఐశ్వర్య అక్కడికి రావడంతో నందు గన్ పడేయగా, లక్కీ దాన్ని తీసుకుని కాలుస్తాడు. పూలన్నీ లవ్ షేపులో ఐశ్వర్యపై పడతాయి. దీంతో కోపంతో లక్కీని లాగిపెట్టి కొడుతుంది ఐశ్వర్య.

ఇక టెండర్ విషయంలో లక్కీ మళ్లీ చెత్త ప్లాన్ వేస్తాడు. ఇందు, రాజు జ్యువెలరీ డిజైన్స్ వేస్తుండటం చూసి వాళ్ల పని చెడగొట్టాలని కరెంట్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. కానీ జనరేటర్ ఉండటంతో లైట్స్ మళ్లీ వస్తాయి. దీంతో జనరేటర్ లో చక్కెర పోసి పాడు చేస్తాడు. ఇదంతా నీకోసమే చేశానని ఐశ్వర్యకు చెప్పి తీసుకొస్తాడు. కానీ వాళ్లు క్యాండిల్ పెట్టుకుని డిజైన్స్ వేయడం చూసి ఇద్దరు షాక్ అవుతారు. నీ బోడి సలహాలు వద్దని లక్కీపై ఐశ్వర్య ఫైర్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Brahmamudi Serial Today October 19th Episode, Brahmamudi Serial Zee Telugu, Aishwarya Power Drama, GR Group Tender Challenge, Indu Raju Romantic Plan Fail]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com