.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1155 లో.....లక్కీ వెళ్లి ఐశ్వర్యతో అబార్షన్ చేయించుకోవద్దని రిక్వెస్ట్ చేస్తాడు. మనం చేసిన తప్పుకు మన బిడ్డను బలి చేయకు.. కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను కానీ నాకు మన బిడ్డ కావాలంటూ ఎమోషనల్ అవుతాడు. దీనికి ఐశ్వర్య ఆరోజు ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది.. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ తీసేసి ఆరోజు చేసిన తప్పును నా జీవితంలోంచి పూర్తిగా తుడిచేస్తానంటూ తెగేసి చెప్తుంది. నీకు నా మీద కానీ నా కడుపులో ఉన్న బిడ్డ మీద కానీ ఎలాంటి రైట్స్ లేవని వార్నింగ్ ఇచ్చి లక్కీని తిట్టి పంపించేస్తుంది.
ఆ తర్వాత లక్కీ నేరుగా రేఖ, భ్రమరాంబ దగ్గరకు వెళ్తాడు. వాళ్లిద్దరూ ఐశ్వర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటే లక్కీ వచ్చి ఐశ్వర్య అబార్షన్ చేయించుకుంటుందని మీరైనా చెప్పి ఆపండని అడుగుతాడు. అందుకు రేఖ తెలివిగా తను చెప్పినా ఐశ్వర్య వినదని.. ఇందు, రాజులకే చెప్పు, వాళ్లే ఐశ్వర్యకు చెప్పాలంటూ తన మాటలతో లక్కీని రెచ్చగొడుతుంది. లక్కీ వెళ్లిపోగానే సమస్యను మనకు అనుకూలంగా మార్చుకోవడంలో నువ్వు చాలా దిట్ట రేఖ అంటూ భ్రమరాంబ మెచ్చుకుంటుంది. ఐశ్వర్య లక్కీని పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా మనకే లాభమని రేఖ ప్లాన్ వేస్తుంది.
ఇక రాజు దగ్గరకు లక్కీ వెళ్లి క్షమించమని ఎమోషనల్ అవుతాడు. రాజు కోపంగా లక్కీని తిడతాడు.. నీ ముఖం చూస్తేనే చిరాకుగా ఉంది.. ముందు ఇక్కడి నుంచి వెళ్లు అంటాడు. అప్పుడు లక్కీ తను తప్పు చేశానని కానీ మళ్లీ ఇంకో తప్పుకు కారణం అవుతున్నానని.. ఐశ్వర్య అబార్షన్ చేయించుకుంటుందని చెప్తాడు. దీంతో రాజు, ఇందు షాక్ అవుతారు. రాజు మేము కూడా ఆపాలని చూస్తున్నాం కానీ ఎలా ఆపాలో అర్థం కావడం లేదని రాజు అంటాడు. అప్పుడు ఇందు నేను ఒప్పిస్తాను లక్కీ, తర్వాత నీకు ఐశ్వర్యకు పెళ్లి జరిపిస్తాను.. ఐషు కడుపులో ఉన్న నీ బిడ్డకు ఏ ప్రమాదం రానివ్వనంటూ లక్కీకి మాటిస్తుంది.
మరుసటి రోజు ఉదయం ఇందు ఐశ్వర్య కోసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు. ఐశ్వర్య ఎక్కడికి వెళ్లిందని అందరు కంగారుపడతారు. కంపెనీ పెట్టించారని అలిగి వెళ్లిపోయిందేమోనని భ్రమరాంబ చెప్తుంది. ఆ తర్వాత ఐశ్వర్య హాస్పిటల్ లో డాక్టర్ దగ్గర ఉంటుంది. బయట లక్కీ కూర్చుని ఏడుస్తుంటాడు. మరోవైపు ఐశ్వర్య దెబ్బకు ఇందు ఆస్తిని పంచే అవకాశం ఉందని రేఖ, భ్రమరాంబ నవ్వుకుంటారు. రాజు, ఇందు ఎంత ట్రై చేసినా ఐశ్వర్య ఫోన్ కలవదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
