
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -995 లో.... రేఖ దగ్గరికి లాయర్ వస్తాడు. దుగ్గిరాల కుటుంబం ఆస్తులు స్వరాజ్ గ్రూప్ అఫ్ కంపెనీస్ అన్నీ కూడా మీ పేరున అయ్యేలా డాక్యుమెంట్స్ రెడీ చేసాను.. మీరు కేవలం ఆ ఇందు చేత ఒక సంతకం పెట్టిస్తే పని అవుతుంది. ఆస్తులన్నీ మీ పేరున ఉన్నట్లేనని లాయర్ అనగానే ఆ ఇందు చేత నేను సంతకం పెట్టిస్తానని రేఖ అంటుంది. మరొకవైపు రాజు, లక్కీల వెంట పోలీసులు పడుతుంటే వాళ్ళని డైవర్ట్ చేసి తప్పించుకుంటారు. ఇంతకు ఈ బ్యాగ్ లో ఏముందని చుస్తే మత్తు పౌడర్ ఉంటుంది.
అది చూసి రాజు షాక్ అవుతాడు. మరొకవైపు ఏంటి ఈ చీర ఐరన్ చేయమంటే చెయ్యలేదని ఇందుపై భ్రమరాంబ కోప్పడుతుంది. నేను చేసాను పిన్ని అని ఇందు చెప్తుంది. అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా అని కోప్పడుతుంది. రేఖ వచ్చి వదిన అలాంటి పనులు ఇక ఇందు చెయ్యదు.. తను ఎవరు అనుకుంటున్నారు ఈ ఇంటికి యువరాణి అని దుగ్గిరాల కుటుంబ వారసురాలు ఇందిరాదేవి అని రేఖ అనగానే అందరు షాక్ అవుతారు. రేఖ అలా ఎందుకు మాట్లాడిందో ఎవరికి అర్థం కాదు. మరోవైపు మత్తు పౌడర్ ని చూసి ఇది తీసుకొని ఎంతో మంది జీవితాలు నాశనం అవుతాయి అలా జరగకుండా చూడాలని రాజు అంటాడు. మనకెందుకు రా అని లక్కీ అంటాడు. మనం చిన్న చిన్న మోసాలు చేసాం కానీ ఇలా జీవితాలు నాశనం చేసే పనులు ఎప్పుడు చెయ్యలేదని. ఆ మత్తు పౌడర్ మొత్తం వాటర్ లో పడేస్తాడు. రాజు పడేసేటప్పుడు రౌడీలు వస్తారు. రౌడీల బాస్ కూడా వచ్చి దాని విలువ పది లక్షలు అని చెప్తాడు. ఇప్పుడు నువ్వు ఆ పదిలక్షలు ఇవ్వకపోతే నీ ఫ్యామిలీ డీటేల్స్ మొత్తం నా దగ్గరున్నాయి. వాళ్ళ సంగతి చెప్తానని రాజుకి రౌడీ వార్నింగ్ ఇస్తాడు.
మరొకవైపు ఇందు కోసం రేఖ చాలా రకాల వంటలు చేయిస్తుంది. ఇందు కూర్చోమని తనకి దగ్గర ఉండి భోజనం వడ్డీస్తుంది. అదంతా ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. తరువాయి భాగంలో నానమ్మ సంతకం చెయ్యకని అంటుంది. సంతకం చేయపోతే వాళ్ళు ఉండరని దేవుడికి మొక్కుకుంటూ బాధపడుతుంది ఇందు. మరొకవైపు ఇందుని కిడ్నప్ చెయ్యమని రాజు, లక్కీలతో ఐశ్వర్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






