
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -991 లో ఇందు నెక్లెస్ దొంగతనం చేసిందని తను వస్తే నిలదియ్యడానికి రెడీగా రేఖ ఉంటుంది. అప్పుడే ఇందు వస్తుంది. నెక్లెస్ దొంగతనం ఎందుకు చేసావని రేఖ అడుగుతుంది. నేను తియ్యలేదు ఆంటీ అని ఇందు చెప్తుంది. ఆ అవసరం ఇప్పుడు నీకే ఉందని ఐశ్వర్య అంటుంది. దీనికి ఇలా కాదు.. ఆ ముసలోడి నడుం విరగ్గొడితే నిజం చెప్తుందని భూషణ్ అంటాడు. వాళ్ళ జోలికి వెళ్ళకండి నన్ను ఏమన్నా పర్వాలేదు కానీ వాళ్ళని ఏం అనొద్దని ఇందు అంటుంది.
మరొక అదంతా హాల్లో జరుగుతుంటే సుభాష్ తో అపర్ణ మాట్లాడుతుంది. అసలు స్వరాజ్ బ్రతికి ఉంటే ఇందుని ఇచ్చి పెళ్లి చెసేవాళ్ళం... ఆ రోజు అందరి బాడీస్ దొరికాయి ఒక బాబుది తప్ప.. నాకు తెలిసి స్వరాజ్ బ్రతికే ఉండి ఉంటాడు.. తప్పకుండా వస్తాడనిపిస్తుందని సుభాష్ తో అపర్ణ అంటుంది. ఆ తర్వాత రాజు, లక్కీ నెక్లెస్ ఇవ్వడానికి రేఖ దగ్గరికి వస్తారు. రాజు ఇంటికి రాగానే నాకు ఏదో గుర్తు వస్తుందన్నట్లు చూస్తాడు. ఇందుని తిడుతుంటే రాజు, లక్కీ లోపలికి వస్తారు. రాజుని చూసిన రేఖ.. బావ కదా అని షాక్ అవుతుంది. నువ్వు రాజ్ కదా అని రేఖ అనగానే అవును రాజు అని అంటాడు. మేం ఐశ్వర్య కోసం వచ్చామని లక్కీ అనగానే ఐశ్వర్య టెన్షన్ పడుతుంది. మనం బయటకు వెళ్లి మాట్లాడుకుందాం అంటుంది.
ఇంప్రెషన్ కొట్టేయ్యడానికి వచ్చి బయటకు వెళ్తే ఏం బావుంటుందని లక్కీ అంటాడు. మేం ఎందుకు వచామంటే ఐశ్వర్య కార్ ప్రాబ్లమ్ వస్తే మా కార్ లో లిఫ్ట్ ఇచ్చాము. అప్పుడు ఈ నెక్లెస్ పడేసుకుందని లక్కీ చూపిస్తాడు. దాంతో రేఖ షాక్ అవుతుంది. మరి ఇంకొక నెక్లెస్ ఎక్కడ అని రేఖ అనగానే స్వాతి తీసుకొని వచ్చి ఇస్తుంది. దాంతో భ్రమరాంబ షాక్ అవుతుంది. వాళ్ళ అమ్మ దాచిపెట్టిన దగ్గర నుండి తీస్తుంది. రేఖ ఆంటీ మీ గది ముందు దొరికిందని స్వాతి చెప్తుంది. తరువాయి భాగంలో అసలు అతను రాజ్ బావలాగా ఉండడం ఏంటి నాకు అతని గురించి అన్ని డీటెయిల్స్ కావాలని రేఖ అనుకుంటుంది. ఆ తర్వాత కరెక్ట్ టైమ్ కీ వాళ్ళు వచ్చారు అక్క అని ఇందుతో స్వాతి అనగానే వాళ్లని నేనే రప్పించానని ఇందు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





