
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 1148....రాజుకు శేషు ఫుల్లుగా మందు తాగిస్తాడు. తాగిన మత్తులో ఉన్న రాజు దగ్గర భ్రమరాంబ సిరి గురించి, ఇందుతో జరిగిన పెళ్లి గురించి నిజం చెప్పమని గట్టిగా నిలదీస్తుంది. దీంతో నిజం చెప్పినట్టు నటించిన రాజు ఒక్కసారిగా కోపంతో రగిలిపోయి భ్రమరాంబపై చేయి చేసుకుంటాడు. శేషు అడ్డుపడినా వినకుండా బడితే పూజ చేస్తాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక భ్రమరాంబ ఏడుస్తూ ఇంట్లోకి పారిపోతుంది.
మరోవైపు మదన్, స్వాతి మాట్లాడుకుంటారు. తమ రూంలో భోజనం చేస్తున్న స్వాతి తినకుండా దిగాలుగా ఆలోచిస్తుంటుంది. ఏమైంది, మీ వాళ్లు గుర్తొచ్చారా అని మదన్ అడగ్గా.. ఈ రోజు అక్క వాళ్లు తెచ్చిన వాటితో తిన్నాం..రేపటి నుంచి మన పరిస్థితి ఏంటని భయంగా ఉందని స్వాతి తన బాధను చెప్పుకుంటుంది. దానికి మదన్ రేపు తనకు ఇంటర్వ్యూ ఉందని, జాబ్ వచ్చాక అడ్వాన్స్ తీసుకుని నిన్ను హ్యాపీగా చూసుకుంటానని ధైర్యం చెప్తాడు. నువ్వు పక్కన ఉంటే ఎన్ని కష్టాలైనా పడతాను బావా అంటూ స్వాతి ఎమోషనల్ అవుతుంది.
మరోవైపు దెబ్బలు తిన్న భ్రమరాంబ రూంలో కూర్చుని ఏడుస్తూ తన గాయాలను చూసుకుంటుంటే, శేషు అక్కడే నిలబడి సింపథీ క్రియేట్ చేయాలని చూస్తాడు. ఇంతలో రేఖ వచ్చి భ్రమరాంబను తిడుతుంది. ఇంత పెద్దదానివై ఏడ్వడం ఏంటని అంటుంది. దీంతో భ్రమరాంబ, నువ్వు కావాలనే చేశావు.. అల్లుడు కొడతాడని నీకు ముందే తెలుసు కదా అంటూ శేషుపై ఫైర్ అవుతుంది. శేషు మాత్రం తనకు ఏమీ తెలియదని నటిస్తాడు. రేఖ, భ్రమరాంబల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.
ఫుల్లుగా తాగి రూంలోకి వచ్చిన రాజు.. చీకట్లో ఇందును చూసి దెయ్యం అనుకుని గట్టిగా అరుస్తాడు. తర్వాత బల్లిని చూసి భయపడి ఆరడుగుల రాజు ఇందును గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇందు, రాజు ఇలా హగ్ లో ఉండగానే సడెన్ గా సిరి రూంలోకి వస్తుంది. ఏం చేస్తున్నారు.. నువ్వు నా మొగుడిని ఎందుకు పట్టుకున్నావంటూ ఇందును సిరి నిలదీయడంతో ఇద్దరు షాక్ అవుతారు. తాత గురక వల్ల నిద్ర పట్టడం లేదని.. కథ చెప్పమని సిరి అడగ్గా రాజు కథ చెప్తూ నిద్రపోతాడు. ఆ తర్వాత ఇందు పాట పాడితే సిరి నిద్రపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Brahmamudi, Brahmamudi Episode 1148, Star Maa Serial, Raju, Indu, Siri, Bhramaramba, Sheshu, Rekha, Madan]






