Home

»

Tv News

Brahmamudi : లక్కీని కొడుకుగా ఒప్పుకున్న రేఖ.. ఆస్తి వద్దంటూ స్వాతితో వెళ్లిపోయిన మదన్!

Sep 11, 2026 11:21AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1134 లో.....లక్కీని తన పెద్దకొడుకుగా రేఖ, భూషణ్ లు ఒప్పుకోవడంతో మదన్ తీవ్రంగా హర్ట్ అవుతాడు. లక్కీని కొడుకుగా ఒప్పుకునే పెద్దమనసు మా మమ్మీకి ఉండొచ్చు కానీ ఇంత జరిగాక నేను తన కొడుకుగా ఉండడానికి ఒప్పుకోవడం లేదంటూ రేఖ ముందే తెగేసి చెప్పాడు.

మదన్ తన మనసులో మాట బయటపెట్టాడు. ఊహ తెలిసినప్పటి నుండి నువ్వు చెప్పిందే విన్నాను.. నువ్వు చూపించిందే ప్రపంచం అనుకున్నాను. కానీ నువ్వు ప్రేమించినంత గొప్పగా ఎవరు ప్రేమించరనుకున్నాను.. అదంతా అబద్ధం. నన్ను నిజంగా ప్రేమించేది స్వాతి మాత్రమే అంటూ అందరి ముందే.. ఐ లవ్ యూ స్వాతి అని ప్రపోజ్ చేస్తాడు. వెంటనే ఇప్పుడే ఇక్కడే ఎంగేజ్మెంట్ చేసుకుంటానని ఉంగరం తీస్తాడు.ఈ ఎంగేజ్మెంట్ ను ఆపేందుకు అపర్ణ, భ్రమరం ప్రయత్నిస్తారు. సడన్ గా ఎంగేజ్మెంట్ కరెక్ట్ కాదని అపర్ణ అనగా ఆస్తి వద్దంటున్నాడు, నా కూతురు సంతోషంగా ఉండదు, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించిందని భ్రమరం అంటుంది. శేషు అడ్డుకుని..‌ స్వాతి మేజర్, తన ఇష్టమే చెల్లుతుందని భ్రమరాన్ని లాక్కెళ్లతాడు. మదన్ స్వాతికి ఉంగరం తొడిగి.. గుడ్ బై మమ్మీ, ఇక నుంచి నీకు, నీ ఆస్తికి నాకు సంబంధం లేదంటూ ఆమెను తీసుకుని వెళ్లిపోతాడు.

రాజ్, ఇందు నచ్చజెప్పినా మదన్ వినడు. మదన్ ప్లీజ్ అని రేఖ బతిమాలుడుతుంది. నీ మొసలి కన్నీళ్లు ఆపు, నీకు ఆస్తి మీద ఉన్న ప్రేమ నా మీద లేదంటూ మదన్  ఫైర్ అవుతాడు. మదన్ వెళ్లిపోయాక రేఖ మనసులో.. నా కొడుకును నాకు దూరం చేసింది రాజు, ఇందు. ఒక్క అవకాశం దొరికినా నీ జీవితాన్ని నాశనం చేస్తానని శపథం చేస్తుంది రేఖ. మరోవైపు భ్రమరం కూడా..‌ఇందు, రాజ్ వల్లే నా కూతురు వెళ్లిపోయింది, ఆస్తి రేఖ సొంతం అయ్యాక వాళ్ల పెళ్లి ఘనంగా చేస్తానని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com