Home

»

Tv News

లక్కీ వల్ల ఐశు ప్రెగ్నెంట్.. తను అబార్షన్ చేయించుకుంటుందా!

Oct 6, 2026 12:42PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1154 లో..... పరీక్షల్లో పాస్ అయిన ఐశు కంపెనీ పెట్టించాలని ఇందుతో గొడవ చేస్తుంది. మన కంపెనీలోనే కొన్నాళ్లు పని చేయాలని ఇందు కండిషన్ పెట్టడంతో కోపంతో ఊగిపోతుంది. ఛాలెంజ్ అంటే ఛాలెంజే, నువ్వు చెప్పినట్లు నేను పాస్ అయ్యాను.. కంపెనీ పెట్టించకపోతే ఊరుకునేదే లేదని అంటుంది. అదే కోపంలో మాట్లాడుతూ ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోతుంది. దీంతో ఇంట్లో అందరూ కంగారు పడతారు. భ్రమరం మాత్రం ఇదంతా ఇందు వల్లే జరిగిందని రెచ్చిపోతుంది. ఇందు వెంటనే రాజుని డాక్టర్ కి ఫోన్ చేయమని చెప్తుంది. డాక్టర్ వచ్చి ఐశును పరీక్షిస్తుంది.

డాక్టర్ పరీక్షించి ఐశు ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అందరు షాక్ అవుతారు. పెళ్లి కాని ఐశు ప్రెగ్నెంట్ ఏంటని ఇంట్లో అందరు ప్రశ్నిస్తారు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పొద్దని డాక్టర్ ని ఐశు బతిమాలినా డాక్టర్ వినకుండా అందరి ముందే నిజం చెప్పేస్తుంది. అసలు నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరని అందరు తిడుతూనే ప్రశ్నిస్తారు. దీంతో ఐశు లక్కీయే తన బిడ్డకు తండ్రి అని చెప్తుంది. ఇది విని ఇంట్లో అందరు మరింత షాక్ అవుతారు. ఫుల్లుగా తాగొచ్చిన ఐశును గదిలోకి తీసుకెళ్లినప్పుడు జరిగిన ఘటనను ఐశు గుర్తుచేసుకుంటుంది. తాగిన మత్తులో లక్కీని తన పక్కన పడుకోబెట్టుకున్నట్లు చూపిస్తారు. ఇది తెలిసి రాజు లక్కీని లాక్కొచ్చి కొడతాడు. నిన్ను ఎంత నమ్మాను.. నీకు మీ అమ్మను కూడా ఇచ్చాను.. చివరకు ఇలా చేశావా అని ఫైర్ అవుతాడు.

ఈ తప్పును వెంటనే సరిచేయాలని ఇందు అంటుంది. లక్కీకి నీకు పెళ్లి జరిపించి తప్పును సరిచేస్తానని చెప్తుంది. దీనికి ఐశు ఒప్పుకోదు. వాడిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి.. నా జీవితం నా ఇష్టం, అబార్షన్ చేయించుకుంటానని తెగేసి చెప్తుంది. ఇది నా లైఫ్, మీరెవరూ జోక్యం చేసుకోవద్దని.. కాదు కూడదు అంటే ఎంతకైనా తెగిస్తానని వార్నింగ్ ఇస్తుంది. సుభాష్ మాత్రం రాజు, ఇందు చేతులు కలిపి దుగ్గిరాల కుటుంబం ఎప్పుడూ ప్రాణం పోసిందే కానీ ప్రాణం తీయలేదని.. ఆ పసి ప్రాణాన్ని కాపాడాలని బతిమాలుతాడు. మరోవైపు ఐశు డాక్టర్ కి ఫోన్ చేసి రేపే బిడ్డను తీసేయమని చెప్తుంది. నాకు బేబీ కంటే నా ఫ్యూచరే ముఖ్యమని అంటుంది. లక్కీ వచ్చి నీ కోపాన్ని నా మీద చూపించు కానీ బిడ్డ ప్రాణాలు తీయొద్దని  రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com