Home

»

Tv News

లక్కీతో పెళ్ళికి ఒప్పుకున్న ఐశు.. ఇందు అగ్రిమెంట్ లో ఏం ఉందంటే!

Oct 8, 2026 10:50AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1156 లో.....ఐశు కనిపించడం లేదని ఇందు, రాజు ఆస్పత్రులకు ఫోన్ చేస్తుండగా లక్కీ నుంచి కాల్ వస్తుంది. రేయ్ ఐశుతోనే ఉన్నానురా.. ఆస్పత్రిలో అని లక్కీ చెప్తాడు. బిడ్డను తీయించుకోబోతోంది మావా.. టెస్టులన్నీ చేశారు.. ఇంకాసేపట్లో ఆపరేషన్ చేస్తారట అని లక్కీ ఏడుస్తాడు. ఇందు రాత్రి నువ్వు మాట ఇచ్చావు కదా ఆపుతానని లక్కీ అంటే ఇందు, రాజు వెంటనే హాస్పిటల్ లొకేషన్ తెప్పించుకొని ఆస్పత్రికి బయలుదేర్తారు. రేఖ మాత్రం ఐశు తీసుకునే డెసిషన్ మీదే మన కాలం ఆధారపడి ఉందని, ఒకవేళ ఆపరేషన్ చేయించుకుంటే ఆస్తి మనకు వచ్చేలా చేస్తానని భ్రమరంతో అంటుంది.

రాజు, ఇందు ఇద్దరు ఆస్పత్రికి చేరుకొని ఆపరేషన్ థియేటర్ కి వెళ్తున్న ఐశును ఆపుతారు. ఏం చేస్తున్నావని ఇందు అడిగితే బిడ్డను తీయించుకోవడానికి వెళ్తున్నానని ఐశు అంటుంది. మీకోసం ఆగాలా, మోసేది నేను, భరించాల్సింది నేను అని ఐశు ఫైర్ అవుతుంది. ఇందు వెంటనే డాక్టర్ తో తనకి ఆపరేషన్ చేయొద్దని అంటుంది. వద్దని చెప్పడానికి మీరెవరని ఐశు అంటే ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా ఎలా ఒప్పుకుంటారని ఇందు డాక్టర్ ని నిలదీస్తుంది. తను మేజర్, చట్టం తనకు హక్కు కల్పించిందని డాక్టర్ అంటుంది. అలా జరగకూడదనే మేము లీగల్ గా కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చామని ఇందు చెప్పి ఫేక్ పేపర్లు చూపిస్తుంది.

స్టే ఆర్డర్ చూసి ఐశు షాక్ అవుతుంది.. మీకు బుద్ధి ఉందా అని అరుస్తుంది. డాక్టర్ మాత్రం కోర్టు స్టే తీసుకొచ్చాక ఆపరేషన్ చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది..కావాలంటే కోర్టు నుంచి క్లియరెన్స్ తీసుకురండి అని చెప్పి వెళ్లిపోతుంది. అందరు ఇంటికి వస్తారు.. ఐశుపై అపర్ణ ఫైర్ అవుతుంది. తప్పు చేసిందే కాకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా.. కుటుంబ పరువు ఏం చేద్దామనుకుంటున్నావని సుభాష్ అంటాడు. నా లైఫ్ నా ఇష్టమని ఐశు అంటూ ఇప్పుడే లాయర్ తో మాట్లాడి పర్మిషన్ తెచ్చుకుని ఆపరేషన్ చేయించుకుంటానని అంటుంది. అప్పుడే ఇందు మేము నీకు అబద్ధం చెప్పాము.. మేము ఏ కోర్టుకూ వెళ్లలేదు..‌నీకిచ్చిన పేపర్లు ఫేక్ అని చెప్పడంతో అందరు షాక్ అవుతారు.

నీ బిడ్డను కాపాడడం కోసం తప్పలేదని రాజు అంటాడు. తర్వాత ఐశుకి ఇందు బిగ్ ఆఫర్ ఇస్తుంది. నువ్వు ఈ బిడ్డను తీయించుకోకూడదు.. లక్కీని పెళ్లి చేసుకోవాలి, అప్పుడే నీకు కంపెనీ పెట్టిస్తానని ఇందు అంటుంది. వండర్ ఫుల్ గేమ్ ఇందు అని ఐశు చప్పట్లు కొడుతుంది. ఇది నమ్మకం కుదరాలంటే అగ్రిమెంట్ చేసుకుందామని ఇందు అంటే ఐశు ఆలోచించి కంపెనీ పెట్టిస్తారా అని అడుగుతుంది. పెళ్లి చేసుకుంటే పెట్టిస్తామని రాజు అంటాడు. ఐశు వెంటనే ఓకే చెప్పి నేను లక్కీని పెళ్లి చేసుకుంటా అగ్రిమెంట్ పేపర్లు తెప్పించండి అని అంటుంది. ఇందు, ఐశు సంతకాలు పెట్టుకుంటారు.. పెళ్లి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చి బాగా చూసుకుంటేనే కంపెనీ అని అగ్రిమెంట్ రాసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com