స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1052 లో....ఇందుని సీఈఓ అవ్వకుండా ఆపాలని ఐశ్వర్య ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ఇందుని తీసుకొని ఐశ్వర్య బయటకు వెళ్తుంది. దారిలో ఒకతను సైకిల్ పై వెళ్తుంటాడు. అతని పేరు నారాయణ. ఐశ్వర్య వెళ్తున్న కార్ కి సైడ్ ఇవ్వడు. దాంతో ఐశ్వర్య హారన్ కొట్టి తనతో కోపంగా మాట్లాడుతుంది. ఇక నారాయణ కోపంగా నీ సంగతి చెప్తాను.. నీకు సైడ్ ఇవ్వనని నారాయణ అనుకుంటాడు.
దాంతో ఐశ్వర్య కోపంగా తనని సైడ్ చేసి వెళ్తుంది. నారాయణకి ఇంకా కోపం వచ్చి ఈ ఇంగ్లీష్ పిల్ల సంగతి చెప్పాలని తన కార్ ని ఫాలో అవుతాడు. ఆ తర్వాత ఇందు, ఐశ్వర్య కార్ దిగుతారు. ఏంటి ఐశ్వర్య ఇక్కడికి తీసుకొని వచ్చావని ఇందు అడుగుతుంది. నీకు ఇంకా అర్థం కాలేదా.. నిన్ను కిడ్నాప్ చేసాను.. నువ్వు సీఈఓ అవ్వడం నాకు ఇష్టం లేదు.. మీటింగ్ అయ్యాక పంపిస్తానని ఐశ్వర్య అనగానే ఎందుకింత మోసం చేసావని రాజుకి ఇందు ఫోన్ చేసి చెప్పాలని అనుకుంటుంది కానీ ఐశ్వర్య ఫోన్ లాక్కుంటుంది. మరొకవైపు రాజు, భూషణ్, రేఖ ఆఫీస్ కి వస్తారు. ఎలాగూ నేనే కాబోయే సీఈఓ అని రాజు వాళ్ళని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు..ఆ తర్వాత బోర్డు మీటింగ్ లో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తే వాళ్ళే సీఈఓ అని రేఖ అంటుంది. నువ్వు వాళ్ళని బ్రతిమిలాడుతావో ఏం చేస్తావో అది నీ ఇష్టమని రాజుతో రేఖ చెప్తుంది. మీ సపోర్ట్ నాకు కావాలని బోర్డు మెంబర్స్ ని రాజు రిక్వెస్ట్ చేస్తాడు. ఇద్దరు రాజుకి సపోర్ట్ చేస్తానని చెప్తారు. పరంధామయ్య మాత్రం ఇందుకి సపోర్ట్ చేస్తాను.. తను ఎక్కడుంది.. ఇంత నిర్లక్ష్యం ఏంటి.. మీటింగ్ ఉంటే త్వరగా రావాలి కదా అని పరంధామయ్య అంటాడు. ఇప్పుడే తనకి ఫోన్ చేస్తానని రాజు అంటాడు. ఇందుకి ఫోన్ చేస్తాడు. ఇందు ఫోన్ ఐశ్వర్య లిఫ్ట్ చేసి ఇప్పుడు అందుబాటులో లేరని చెప్తుంది.
అప్పుడే పరంధామయ్య వస్తాడు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందని రాజు అతనికి చెప్తాడు. మీరు నాకే సపోర్ట్ చెయ్యాలని రాజు అనగానే నీ మాటతీరు, వెకిలిచేష్టలు నాకు నచ్చలేదు.. ఆ రేఖకి అయినా చేస్తానేమో కానీ నీకు అసలు చెయ్యనని పరంధామయ్య చెప్తాడు. మరొకవైపు నారాయణ ఒక దగ్గర కార్ ఆగి ఉండడం చూసి.. ఆ పొగరుబోతు పిల్ల ఇక్కడే ఉండి ఉంటుందని లోపలికి వెళ్తాడు. అక్కడ ఇందుని తాళ్లతో ఐశ్వర్య బంధించడం చూసి ఇద్దరు కలిసే వచ్చారు కదా అని నారాయణ అనుకుంటాడు. ఐశ్వర్య, ఇందు మాట్లాడుకోవడం చూసి ఈ అమ్మాయిని ఎలా అయినా సేవ్ చెయ్యాలని అనుకుంటాడు. తరువాయి భాగంలో ఇందుని నారాయణ సేవ్ చేసి మీటింగ్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
