Brahmamudi: రాహుల్ వెన్నుపోటు.. రాజ్, కావ్య నిజం తెలుసుకుంటారా?
on Dec 16, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -904 లో... కేరళ నుండి రాజ్, కావ్య ఇంటికి వస్తారు. మీరు మమ్మల్ని ఎందుకు మోసం చేసారు, కావ్యకి ప్రాబ్లమ్ లేదని ఎందుకు చెప్పారని అపర్ణ అంటుంది. దాంతో రాజ్ జరిగింది మొత్తం చెప్తాడు. ఇప్పుడు కావ్యకి ఏం ప్రాబ్లమ్ లేదని కేరళ వైద్యం గురించి చెప్తాడు. దాంతో ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.
అప్పుడే ఒకతను ఫోన్ చేసి బిజినెస్ ఎక్సలెంట్ అవార్డు ఏ టైమ్ కి వస్తున్నారని అడుగుతారు. అవార్డు ఏంటని ఆశ్చర్యంగా అడుగుతాడు రాజ్. ఆ తర్వాత నేను చెప్తాను రాజ్ అని స్వప్న అంటుంది. చాలా తక్కువ టైమ్ లోనే రాహుల్ మంచి పేరు సంపాదించి అందరి ద్రుష్టిని తనవైపుకి తిప్పుకున్నాడని చెప్తుంది. దాంతో రాజ్, కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
మరొకవైపు అప్పు కేసు గురించి బయటకు వెళ్ళాలని కళ్యాణ్ కి చెప్తుంది. ఇద్దరం వెళ్తే డౌట్ వస్తుంది. నువ్వు ఒక్కదానివే వెళ్ళు.. నేను ఇంట్లో కవర్ చేస్తానని అంటాడు. అప్పుని ఎవరు చూడకుండా కార్ ఎక్కించి పంపిస్తాడు. అది ప్రకాష్ చూస్తాడు. ఆ తర్వాత ధాన్యలక్ష్మి, అప్పు కోసం జ్యూస్ తీసుకొని వెళ్తుంటే కళ్యాణ్ ఆపి.. అప్పు బాత్రూంలో ఉంది. నేను తీసుకొని వెళ్తానని అంటాడు. సరే అని ధాన్యలక్ష్మి వెళ్తుంది. అదేంట్రా అప్పుని కార్ ఎక్కించి పంపించావని ప్రకాష్ అనగానే కళ్యాణ్ టెన్షన్ పడుతూ అతన్ని డైవర్ట్ చేస్తాడు.
ఆ తర్వాత రాజ్, కావ్య ఇంకా స్వప్న, రాహుల్ నలుగురు అవార్డు ఫంక్షన్ కి వెళ్తారు. నువ్వు ఇంత త్వరగా బిజినెస్ లో సక్సెస్ సాధించావ్ కాబట్టి నీకు గిఫ్ట్ అని రాహుల్ కి రాజ్ వాచ్ ఇస్తాడు. ఇంత ఖరీదైనది ఎందుకని రాహుల్ అంటాడు. ఆ తర్వాత నలుగురు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



