Home

»

Tv News

Brahmamudi: ఒక్కరోజులో ఇందు పెళ్ళికి రేఖ ఏర్పాట్లు.. రాజ్ వస్తాడా.?

Nov 1, 2026 8:04AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ 1177 లో... ఇంటికి తిరిగి రావాలని రాజుని నందు అడుగుతుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి నందు వెళ్లిపోతుంది. ఆమె వెంటే వెళ్లిన చలపతి రాజు, ఇందులను కలపడానికి మాత్రం మళ్లీ తమ ఇంటికి రావద్దని వార్నింగ్ ఇస్తాడు. వెంకీ విషయంలో తను చేసిన తప్పు, నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్తున్నా, వాళ్లను కలపడానికి పోస్ట్ మ్యాన్ లా మారొద్దని స్పష్టం చేస్తాడు. పెద్దవాడినైనా దండం పెడుతున్నానని అనడంతో నందు సారీ చెప్పి వెళ్లిపోతుంది.

ఇటు ఇందు కోసం రేఖ పెళ్లి సంబంధం చూస్తుంది. ఓ రీల్స్ ఫ్యామిలీని తీసుకొస్తుంది. చూడటానికే అదోలా ఉన్న పెళ్లి కొడుకు తన పేరు ఫంకీ వినయ్ అని, తను రీల్స్ చేస్తుంటానని చెప్తాడు. ఇందుని చూడగానే తెగ ఇదైపోతాడు, తను పెళ్లికి రెడీ అని, ఇలాంటి అమ్మాయిని ఎవరు కాదంటారని అంటాడు. వెంటనే ముహూర్తం పెట్టాలని అడుగుతాడు. అతన్ని చూసి అపర్ణ, నందు అబ్బాయి నచ్చలేదని చెప్పమని ఇందుపై ఒత్తిడి తెస్తారు. కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా అలా కూర్చుంటుంది.

మరోవైపు పెళ్లి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రేఖ చూస్తుంది. వచ్చే ఆరు నెలల్లో ముహూర్తం ఉందని పంతులు చెప్పగానే మరో గంటలోనే పెళ్లి కావాలని భ్రమరాంబ అంటుంది. రేపు 10.20 గంటలకు మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్పడంతో రేఖ సరే అంటుంది. ఇంత త్వరగా పెళ్లేంటని అపర్ణ వాదిస్తున్నా రేఖ పట్టించుకోదు. రేపు పెళ్లి టైమ్ కు వస్తామంటూ అబ్బాయివాళ్లు వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిన తర్వాత అబ్బాయి తనకు నచ్చాడని చెప్పి ఇందు వెళ్లడంతో అపర్ణ, నందు షాక్ తింటారు.

ఇంట్లో అన్న రాజు కోసం వెంకీ బాధపడుతూ తల్లి లక్ష్మి దగ్గరికి వెళ్లి అన్నయ్య తరఫున మాట్లాడాలని అంటాడు. తను ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, కనీసం అన్నయ్యనైనా ఇందుని పెళ్లి చేసుకోనివ్వండని చెప్పి వెళ్లిపోతాడు. ఇటు ఉదయాన్నే ఆఫీసుకు వెళ్తున్న ఇందుని భ్రమరాంబ అవమానించేలా మాట్లాడుతుంది. ఆఫీసులోనూ ఉద్యోగులు ఇందు, రాజు నాటకమాడారంటూ మాట్లాడుకోవడంతో ఇందు వార్నింగ్ ఇస్తుంది. వీళ్లను కలపడానికి ప్రశాంత్ రంగంలోకి దిగి ఆర్డర్ పై సంతకం కావాలని రాజుకి ఫోన్ చేస్తాడు. 

మరుసటి రోజు ఇందు పెళ్లికి రెడీ అవుతూ బావ వస్తాడన్న నమ్మకంతో ఉండగా, అపర్ణ రాజుకి ఫోన్ చేస్తుంది. రాజు మాత్రం దేవదాసులా కూర్చుండిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com