Home

»

Tv News

Brahmamudi : రేఖ రహస్యం, ఐశ్వర్య మోసం.. దుగ్గిరాల కుటుంబానికి పొంచి ఉన్న కొత్త ముప్పు!

Jul 30, 2026 10:06AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1097 లో.....మదన్ బాధపడుతుంటే రేఖ వెళ్తుంది. ఎందుకు అమ్మ వాడి గురించి నన్ను కొట్టావ్.. అసలు వాళ్ళ అమ్మని నువ్వు వెతుకుతానని మాటిచ్చావ్.. అసలు వాళ్ళ అమ్మ కి నీకు సంబంధం ఏంటని మదన్ అడుగుతుంటే రేఖ సైలెంట్ గా ఉంటుంది. ఇదే నీలో వచ్చిన మార్పు.. ఇంతకముందు నేను ప్రశ్న అడగకముందే సమాధానం చెప్పేదానివి ఇప్పుడు అడిగినా సమాధానం చెప్పట్లేదని రేఖతో మాధవ్ అంటాడు.

ఆ తర్వాత ఐశ్వర్యని తన క్లాస్ మేట్ శశి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. తనకి డైమండ్ రింగ్ ఇస్తాడు. అదంతా ఇందు చూస్తుంటే ఐశ్వర్య చూసి కావాలనే శశిని హగ్ చేసుకొని థాంక్స్ చెప్తుంది. రేపు ఇద్దరం కలిసి బయటకు వెళదామని శశి అనగానే ఐశ్వర్య సరే అంటుంది. ఆ తర్వాత ఐశ్వర్య లోపలికి వెళ్తుంటే ఎవరు అతను అని ఇందు అడుగుతుంది. నా బాయ్ ఫ్రెండ్ అని ఐశ్వర్య చెప్తుంది. ఎందుకు అలా చేస్తున్నావ్.. ఎవరిని నమ్మకూడదని ఇందు చెప్తుంది. ఏంటి ఏదో నా గురించి అలోచించినట్లు యాక్టింగ్ చేస్తున్నావని ఐశ్వర్య అంటుంది.ఆ తర్వాత వెంకీకి నందు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యడు. దాంతో  చలపతికి నందు ఫోన్ చేస్తుంది. దంతో వెంకీకి చలపతి ఫోన్ ఇస్తాడు. నాకు పని ఉంది అని వెంకీ ఫోన్ కట్ చేస్తాడు. ఎందుకు రా అలా మాట్లాడుతున్నావని చలపతి అనగానే నువ్వే కదా దుగ్గిరాల ఇంటి వాళ్లతో ఏ సంబంధం పెట్టుకోకు అని వెంకీ అంటాడు. అంటే ఏంట్రా అని చలపతి అనగానే నందు ఆ దుగ్గిరాల వారసురాలు అని వెంకీ చెప్తాడు. వాళ్ళు షాక్ అవుతారు. అన్నయ్య ఇలాగే ప్రాబ్లమ్ వెతుక్కుంటూ వెళ్ళాడు. నువ్వు వాళ్ళకి దూరంగా ఉండు అని చలపతి చెప్తాడు.

ఆ తర్వాత లక్కీ రాజు హాల్లో ఉంటారు. రేఖ వర్క్ చేసుకుంటుంది. భ్రమరాంబని చూసి మా అమ్మ అలా ఉంటుందా అని లక్కీ అనగానే మీ అమ్మ అలా వుండదు.. రేఖ పిన్ని లాగా మోడ్రన్ గా ఉంటుందని రాజు అనగానే అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలవని లక్కీ అంటాడు. అందుకేగా నిన్ను వదిలేసిందని రాజు అనగానే రేఖ కోపంగా అక్కడ నుంచి వెళ్తుంది. ఆ తర్వాత పెళ్లి అయిన దగ్గర నుంచి ఏ పూజ చేయలేదు.. రాజు నువ్వు కలిసి సత్యనారాయణ వ్రతం చెయ్యాలని ఇందుతో అపర్ణ అంటుంది. ఇప్పుడు అవేం వద్దని ఇందు చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com