Brahmamudi : కావ్య ఇచ్చిన జలక్ తో రుద్రాణి షాక్.. ఆ చెక్ చించేసిందిగా!
on Jan 10, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -616 లో..... స్వప్నకి శ్రీమంతం చెయ్యాలని కావ్యతో రుద్రాణి చెప్తుంది. మన కుటుంబం పెద్దది కాబట్టి గ్రాండ్ గా చెయ్యాలని రుద్రాణి అంటుంది. నువ్వేం అనడం లేదేంటి కావ్య.. కొంపదీసి నీకు ఇష్టం లేదా అని రుద్రాణి అడుగుతుంది. అక్కకి శ్రీమంతం అంటే నాకు సంతోషమే కదా అని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్యని రాజ్ గదిలోకి తీసుకొని వెళ్లి.. ఏంటి శ్రీమంతం చేస్తానంటున్నావ్.. ఇప్పుడు ఖర్చు ఇరవై లక్షలు అవుతుందని రాజ్ అంటాడు. ఇప్పుడు నేను వద్దనంటే మా అక్కకి శత్రువుని అవుతానని కావ్య అంటుంది.
ఇదంతా రుద్రాణి కావాలని చేస్తుంది.. నా ప్లాన్ నాకుందని రాజ్ తో కావ్య అంటుంది. ప్లాన్ రివర్స్ అయి ఇంట్లో వాళ్లు నీపై దండెత్తితే నేనేం చేయలేనని రాజ్ అంటాడు. మరొకవైపు రుద్రాణి, ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి.. చూసావా ఆ కావ్యని ఎలా ఇరికించానో అని హ్యాపీగా చెప్తుంది. నువ్వు నీ కోడలికి శ్రీమంతం చేస్తున్నావ్. ఇందులో నాకేంటి లాభమని ధాన్యలక్ష్మి అంటుంది. అంటే ఇప్పుడు అన్నింటికి కావ్య రిస్ట్రిక్షన్ పెడుతుంది కదా.. చెల్లి విషయం వచ్చేసరికి ఖర్చు అయిన చేస్తానంటుంది కదా ఈ విషయంతో అక్కకి ఒకలా మాకు ఒకలా అని గొడవ చెయ్యొచ్చని రుద్రాణి అంటుంది. ఒకవేళ కావ్య శ్రీమంతం సింపుల్ గా చేద్దామంటే ఏం చేస్తావని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఏం ఉంది అసలు కావ్యకి మనసు లేదు ఇలా అంటుంది అంటూ మనమే రివర్స్ అవుదామని రుద్రాణి అంటుంది. మరొకవైపు కళ్యాణ్ కి లిరిక్ రైటర్ ఫోన్ చేసి.. ఇంకా సాంగ్ పంపలేదని తిడుతాడు. దాంతో కళ్యాణ్ పంపిస్తానని చెప్తాడు.
మరొకవైపు కనకం ఇంటికి వెళ్తుంది కావ్య. కావ్య రావడంతో మళ్ళీ రాజ్ గెంటేసాడేమోనని కనకం భయపడుతుంది. అదేం లేదు అమ్మ.. అక్కకి శ్రీమంతం చేయాలనుకుంటున్నారు కానీ అక్కడ వద్దు ఇక్కడ చెయ్యాలని చెప్పు.. నన్ను అర్థం చేసుకోమని కనకాన్ని కావ్య రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు ఇంతలా అంటున్నావంటే ఏదో కారణం ఉంటుంది. సరే రేపు వచ్చి మాట్లాడుతానని కనకం అంటుంది. మరుసటిరోజు రుద్రాణి రాహుల్ లు శ్రీమంతానికి లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. తరువాయి భాగంలో రుద్రాణి లిస్ట్ ఇవ్వగానే కావ్య ఇరవై లక్షల చెక్కు రుద్రాణికి ఇస్తుంది. అప్పుడే కనకం వస్తుంది శ్రీమంతం విషయం అపర్ణ చెప్పగానే.. నా కూతురు శ్రీమంతం నా ఇంట్లో చెయ్యాలి.. ఇది వారసత్వంగా వస్తుందని కనకం చెప్పగానే.. రుద్రాణి దగ్గర నుండి కావ్య చెక్ తీసుకొని.. ఇప్పుడు ఇది అవసరం లేదని చింపేస్తుంది. దాంతో రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read