Home

»

Tv News

Brahmamudi: డిగ్రీ పాస్ అయిన ఐశ్వర్య.. కంపెనీ పెట్టించాలని డిమాండ్.!

Oct 4, 2026 12:05PM

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1153 లో.....రాజు దగ్గరకు వెళ్లిన అపర్ణ సారీ చెప్తుంది. సిరి విషయంలో నీ గురించి తెలిసి కూడా అపార్థం చేసుకున్నానని బాధపడుతుంది. ఇక నుంచి సిరి నీ బాధ్యతనే కాదు, మా బాధ్యత కూడా. తనకు గతం గుర్తుకు వచ్చే వరకు మేము జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పగానే రాజు థాంక్స్ చెప్తాడు. మీలాంటి ఫ్యామిలీ దొరికినందుకు సంతోషంగా ఉందని రాజు అంటుంటే ఒరేయ్ నువ్వు నా మనవడివిరా, ఈ చేతులతో నిన్ను ఎత్తుకుని గోరుముద్దులు తినిపించాను, ఆ నిజం నీకు ఎప్పుడు చెప్పే టైం వస్తుందోనని అపర్ణ మనసులోనే బాధపడుతుంది .

మరోవైపు రేఖ కోపంగా శేషును తిడుతుంటే భ్రమరాంబ.. మా ఆయనను తిట్టొద్దు, నీ కోపం ఆ రాజు మీద చూపించమని రేఖను తిడుతుంది. ఎప్పటిలాగే ప్లాన్ చేస్తావ్.. అది ఫ్లాప్ అవుతుంది. నువ్వేమో మా మీద పెత్తనం చేస్తావ్, ఇక ఆ రాజును మనం ఏమీ చేయలేం, ఈ ఆస్తి మనది అని చెప్పుకునే రోజు వస్తుందా? అని భ్రమరాంబ ప్రశ్నిస్తుంది. దానికి శేషు ఒక ఐడియా చెప్తాడు. మీరు మారిపోయినట్టు ఏడుస్తూ వెళ్లి అల్లుడి కాళ్ల మీద పడి, మేము తప్పు చేశాం క్షమించండి, మంచిగా బతకడానికి కొంచెం డబ్బు ఇస్తే కంపెనీ పెట్టుకుంటామని బతిమిలాడితే ఇచ్చేస్తాడని చెప్పగానే భ్రమరాంబ ఫైర్ అవుతుంది.

ఇక సిరికి ఇందు అన్నం తినమని చెప్తుంటే సిరి.. వద్దు నాకు భయంగా ఉంది, ఆ రౌడీ గాడు నన్ను కొట్టాడు, మళ్లీ వస్తాడేమోనని ఏడుస్తూ గార్డెన్ లోకి వెళ్తుంది. ఇప్పుడెలా, సమయానికి రాజు కూడా లేడు అని ఇందు ఆలోచిస్తుండగా, రాజు జోకర్ వేషం వేసుకుని వచ్చి సిరిని నవ్విస్తాడు. పాట పాడుతూ డాన్స్ చేస్తుండగా  సిరికి ఇందు అన్నం తినిపిస్తుంది.

చివర్లో అసలు హైలెట్.. ఐశ్వర్య తను డిగ్రీ పాస్ అయ్యానని రిజల్ట్ పేపర్ చూపిస్తూ గర్వంగా ఇంట్లో చెప్తుంది. నన్ను హేళన చేశారు, నా ఛాలెంజ్ వెనక్కి తీసుకోమన్నారు, కానీ నేను పాస్ అయ్యానని  అంటుంది. అందరూ షాక్ అయి కంగ్రాట్స్ చెప్తారు. వెంటనే భ్రమరాంబ.. నువ్వు చెప్పినట్టు ఐశ్వర్య పాస్ అయింది కదా, కంపెనీ ఎప్పుడు పెట్టిస్తావని  ఇందును నిలదీస్తుంది. నాకు ఇప్పుడే కంపెనీ పెట్టించాలని ఐశ్వర్య డిమాండ్ చేస్తుంది. దానికి ఇందు.. కంపెనీ పెట్టించాలంటే ఇంకో అర్హత ఉండాలి, కంపెనీని నడిపించే అనుభవం నీకు లేదని  అంటుంది. మా కంపెనీలో ఒక ప్రాజెక్ట్ ఇస్తా, అది సక్సెస్ చేస్తే కంపెనీ పెట్టిస్తానని ఇందు ఆఫర్ ఇవ్వగా నన్ను నీ కింద బానిసను చేసుకోవాలనుకుంటున్నావా? నీకేం ఎక్స్పీరియన్స్ ఉందని సీఈవో అయ్యావని  ఐశ్వర్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com