Brahmamudi : అపర్ణ కూతురే రేవతి అని చెప్పేసిన ఇందిరాదేవి.. షాక్ లో కావ్య!
on Jul 17, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -775 లో... శ్రీనుని కిడ్నాప్ చేసారని డిసస్పాయింట్ గా రాజ్, కావ్య వస్తుంటే.. ఇందిరాదేవిని చూస్తాడు రాజ్. నానమ్మ ఇక్కడ ఉన్నావని అడుగుతాడు. పని మీద వచ్చానని రాజ్, కావ్యలని దబాయించి టాపిక్ డైవర్ట్ చేస్తుంది ఇందిరాదేవి. ఆ తర్వాత యామిని తనలో తాను నవ్వుకుంటుంటే అప్పుడే వైదేహి వస్తుంది. ఏమైంది నీలో నువ్వే నవ్వుకుంటున్నావని అడుగుతుంది. దాంతో యామిని తన ప్లాన్ చెప్తుంది.
రాజ్, కావ్య కోసం ఇంట్లో అందరు ఎదరు చూస్తారు. రాజ్ కావ్య రాగానే ఏమైంది.. ఆ రౌడీ ని పట్టుకున్నారా అని అందరు అడుగుతారు. లేదు తనని ఎవరో కిడ్నాప్ చేసారని రాజ్ చెప్తాడు. అయిపోయింది అంతా అయిపోయింది ఇక అప్పు జైలు కి వెళ్లడం ఖాయం.. ఈ ఇంటి పరువు ఇక పోతుందని రుద్రాణి అంటుంటే.. ఎందుకు అలా చేస్తావని ఇందిరాదేవి కోప్పడుతుంది. మరొకవైపు శ్రీను దగ్గరికి వస్తుంది యామిని. నువ్వు ఈ రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు.. నిన్ను కిడ్నాప్ చేసిందని అప్పుపై మరొక కేసు అవుతుంది. అందుకే నువ్వు రావద్దు.. డబ్బు ఇస్తానని యామిని అనగానే శ్రీను సరే అంటాడు.
ఆ తర్వాత ఇందిరాదేవి తన బాధ దేవుడికి చెప్పుకుంటూ బాధపడుతుంది. అప్పుడే కావ్య వచ్చి.. ఏమైంది మీరేదో కంగారుగా ఉన్నారు.. ఏదో దాస్తున్నారని కావ్య అడుగుతుంది. ఏం లేదని ఇందిరాదేవి అంటుంది. నేను మిమ్మల్ని రేవతి గారి ఇంటి దగ్గర చూసాను.. అంత రహస్యంగా దాచాలసిన అవసరం ఏంటని కావ్య అడుగుతుంది. ఏం లేదని ఇందిరాదేవి అనగానే అయితే ఈ రేవతి గారు ఎవరో అత్తయ్యని అడుగుతనని కావ్య వెళ్తుంటే.. ఇందిరాదేవి ఆపుతుంది. తరువాయి భాగంలో అపర్ణ కూతురు రేవతి అని జరిగింది మొత్తం కావ్యకి చెప్తుంది ఇందిరాదేవి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



