స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1147 లో.....డైనింగ్ టేబుల్ దగ్గర గొడవ జరుగుతుంది. తన ఆంటీని అనే హక్కు నీకు లేదు, ఈ ఇంట్లో మేం జాలి చూపిస్తే ఉంటున్నావని ఐశ్వర్య జోక్యం చేసుకుంటే తన భర్త విషయంలో ఎలా పడితే అలా మాట్లాడొద్దని ఇందు అంటుంది. రాజు మరింత చెలరేగి.. అసలు ఈ ఇంటికి వారసురాలు మీ ఆంటీ కాదు, నా భార్య ఇందు. ఆమె భర్తను కాబట్టి ఈ ఇంటిపై నాకూ పూర్తి హక్కులు ఉన్నాయి.. నేను ఏం చెప్తే అది అందరూ వినాల్సిందే.. ఇంకోసారి సిరి విషయంలో ఎవరైనా నోరు జారితే చెప్తా అని రాజ్ వార్నింగ్ ఇస్తాడు.
మరోవైపు సిరి నుంచి వివరాలు రాబట్టే ప్లాన్ ఫెయిల్ అవడంతో భ్రమరాంబ, రేఖ మరో ప్లాన్ వేస్తారు. శేషుని పిలిచి మందు బాటిల్ చేతిలో పెడుతుంది భ్రమరాంబ. దీంతో అతడు ఫుల్ ఖుషీ అయిపోతాడు. ఆ రాజుతో కూర్చుని అతని నుంచి సిరి వివరాలు రాబట్టాలని చెప్తుంది. తను చేయనని మొదట శేషు అంటాడు. మందు బాటిల్ లాక్కోవడానికి వెళ్తే సరే చేస్తానని రాజు దగ్గరికి వెళ్తాడు. కాస్త మందేద్దాం వస్తావా అని అడుగుతాడు. దీంతో రాజు టెంప్ట్ అవుతాడు. ఇందు దగ్గర.. రెండే గ్లాసులు అంటూ రాజు అనుమతి తీసుకుంటాడు. ఆమె ఓకే చెప్పడంతో ఆనందంతో ఆమెకు ముద్దిచ్చి సారీ చెప్పి శేషుతో వెళ్లిపోతాడు.
ఇటు ఐశ్వర్య గదిలో లక్కీ సీన్ నడుస్తుంది. ఐశ్వర్య దగ్గరికి లక్కీ పాలు తీసుకొని వస్తాడు. పరీక్షలు అయిపోయాయి కదా ఇంకా ఏం చదువుతున్నావని అంటాడు. ఇది పరీక్షల కోసం కాదు, ఇందు నాకు బిజినెస్ పెట్టిస్తుంది కదా.. అందుకే బిజినెస్ పాఠాలు నేర్చుకుంటున్నానని ఐశూ చెప్తుంది. నువ్వు డిగ్రీ పాసవుతావా, ఒక్కదాంట్లో ఫెయిలైనా ఫెయిలే కదా.. అప్పుడు ఇందు కంపెనీ పెట్టివ్వదు కదా అని లక్కీ అనడంతో ఐశ్వర్య మండిపడుతుంది. రోజూ నువ్వే తెచ్చుకుంటున్నావ్ కదా నీకెందుకు కష్టమని తెచ్చా, మా అమ్మ నన్ను కొడుకుగా అంగీకరించింది కదా, మనం బావా మరదళ్లం కదా అని లక్కీ అంటే.. నువ్వు గదిలోకి రావద్దని ఐశ్వర్య వార్నింగ్ ఇస్తుంది.
శేషు, రాజు మందు పార్టీ స్టార్ట్ చేస్తారు. స్టఫ్ ఎక్కడ అని రాజు అడిగితే.. వస్తుంది చూడు అని శేషు అంటాడు. అప్పుడే ఆమ్లెట్లతో భ్రమరాంబ ఎంట్రీ ఇస్తుంది. రాజు షాక్ తింటాడు. మీ మామయ్యే చెప్పాడని భ్రమరాంబ అంటే రాజు బలవంతంగా ఆమెను కూర్చోబెడతాడు. మెల్లగా మందెక్కువవడంతో రాజు భ్రమరాంబతో ఆడుకోవడం మొదలుపెడతాడు. ఏమే సూర్యకాంతం అత్తా, నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే ఎవడికో ఇచ్చి చేస్తావా అని క్లాస్ పీకుతాడు. సిరి గురించి చెప్పు, ఆమె ఎవరు, నీకు ఎప్పుడు పరిచయం అయిందని భ్రమరాంబ ఆరా తీసే ప్రయత్నం చేస్తే రాజు రెచ్చిపోయి భ్రమరాంబను చితకబాదుతాడు. ముందు చేత్తో, తర్వాత కర్రతో ఎడాపెడా బాదేస్తాడు. దీంతో శేషుతో కలిసి ఆమె పారిపోతుంది. ఆ తర్వాత గదిలోకి వెళ్లిన రాజు ఇందు కాళ్ల దగ్గర ఉంటాడు. తాగి గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పానని ఇందు క్లాస్ పీకుతుంటే బల్లిని చూసి భయంతో రాజు ఇందును హగ్ చేసుకుంటాడు. దీంతో ఆమెలోనూ ప్రేమ పుట్టి హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Brahma Mudi Today Episode September 26, Brahma Mudi Serial Latest Episode, Raju Indu Romance Brahma Mudi, Bhramaramba Plan Reverse]




