.webp)
సోషల్ మీడియాలో రాము రాథోడ్ సాంగ్స్ కి ఎంతో క్రేజ్ ఉంది. రాము ఏ సాంగ్ చేసినా అది బాగా వైరల్ అవుతుంది. "రాను ముంబైకి రాను " సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. తర్వాత "డీజే పిల్ల " సాంగ్ కూడా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సాంగ్స్ వలన రాము రాథోడ్ కి మంచి పేరొచ్చింది. ఆ పేరు కాస్తా బిగ్ బాస్ కి తీసుకెళ్లేలా చేసింది. డీజే పిల్ల సాంగ్ 13 మిలియన్ వ్యూస్ సంపాదించింది రిలీజయిన ఐదు నెలలకు. ఇక రాను ముంబై కి రాను సాంగ్ 935 మిలియన్ వ్యూస్ ని సంపాదించుకుంది. అలాంటి మాస్ సాంగ్స్ కి పెట్టింది పేరైన రాము రాథోడ్ ఒక మూవీలో నటిస్తున్నాడు. దాని గురించి విశేషాలను ఒక వీడియో చేసి పెట్టాడు.
"అందరికీ నమస్తే. నేను మీ రాము రాథోడ్. నాకు చిన్నప్పటినుంచి సాంగ్స్ అన్నా డాన్స్ అన్న చాలా ఇష్టం. నన్ను మీ అందరికీ పరిచయం చేయడానికి ఈ కళ ఉపయోగపడింది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ఐతే అప్డేట్ ఏంటి అంటే త్వరలో నేను ఒక ఇండిపెండెంట్ మూవీతో మీ అందరి ముందుకు రాబోతున్న. అందులో నేను హీరోగా చేశా. ఎప్పటిలాగే మీరంతా నన్ను సప్పోర్ట్ చేసి మీ ప్రేమను అందించాలి. విజిల్ స్టూడియోస్ ఆధ్వర్యంలో ఈ మూవీ రాబోతోంది. మీరంతా నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ సపోర్ట్ నా భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. ఫస్ట్ టైం మూవీలో నటించాను. నాకు కాన్ఫిడెంట్ ఇవ్వడానికి మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. " అని చెప్పాడు.
ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ అంతా కూడా రాము రాథోడ్ ని విష్ చేస్తున్నారు. "ఆల్ ది బెస్ట్ అన్న. మీ డ్యాన్సింగ్ స్టైల్ వేరే లెవెల్ అన్నా. మీ మూవీ కోసం వెయిటింగ్ అన్నా. మీరు ఇంకా మంచి మంచి తీస్తూనే ఉండాలి. తప్పకుండా సక్సెస్ అవుతావు. " అంటూ కామెంట్స్ చేశారు.




.webp)
.webp)
