Home

»

Tv News

బిందుమాధవి ఫేవరేట్ జడ్జ్... చిరంజీవి నుంచి అల్లు అర్జున్ వరకు డాన్స్ ఇన్స్పిరేషన్ ఎవరంటే...

Oct 15, 2026 2:47PM

వంటస్టిక్ కార్యక్రమం ద్వారా టేస్టీ తేజ మంచి వంటలు ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. అలాగే సెలబ్రిటీ గెస్టులను తీసుకొచ్చి మంచి కబుర్లు కూడా చెప్తున్నాడు. రీసెంట్ షోకి అమరదీప్ ని తీసుకొచ్చాడు తేజ.  "మాస్ జాతరలో నీ ఫేవరేట్ జడ్జ్ ఎవరు " అని టేస్టీ తేజ అడిగేసరికి అమరదీప్ "బిందుమాధవి " అని చెప్పాడు. "మాస్ జాతరలో నీ ఫేవరేట్ యాంకర్ ఎవరు " అని అడిగాడు. ముందు పడీపడీ నవ్వి "మాస్  జాతరలో నా ఫేవరేట్ యాంకర్ నేనే కదరా" అంటూ చెప్పాడు అమరదీప్. దాంతో తేజ "మర్చిపోతూ ఉంటాను అప్పుడప్పుడు గుర్తు చేయరా నువ్వు " అన్నాడు.  "అంటే షోలో గ్యాప్ వచ్చిందని మర్చిపోయావారా " అన్నాడు అమరదీప్. "అవును . మర్చిపోయాను. మళ్ళీ రి-ఎంట్రీ ఎప్పుడు మా వాళ్లంతా అడుగుతున్నారు " అన్నాడు తేజ.
"ఏదో అలా చిన్న గ్యాప్ వచ్చింది అంతే." అన్నాడు అమరదీప్. "ఐతే మళ్ళీ కం బ్యాక్ వస్తుందా " అని అడిగాడు తేజ. "చాలా గట్టిగా వస్తుంది" అన్నాడు అమరదీప్.

"ప్రస్తుతం ఎం ప్రాజెక్ట్స్ చేస్తున్నావ్.. సుమతి శతకంతో సుమారు ఆరు నెలల పాటు ఊపావు తిరిగావు నీతో పాటు నన్ను తిప్పేశావు. నెక్స్ట్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి" అని అడిగాడు. "చెప్పేదాన్ని కంటే చూపించడం మేలు కదా. ప్రస్తుతానికి కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఆ గ్యాప్ ని చాలా గట్టిగానే ఫుల్  ఫీల్ చేస్తాను. " అన్నాడు అమరదీప్. "అప్ కమింగ్ ప్రాజెక్ట్స్  రెడీ ఉన్నాయి అంటావు ఐతే అనేసరికి అందులో నువ్వు కూడా ఉన్నావన్న సంగతి మర్చిపోయినట్టు ఉన్నావు. " అన్నాడు అమర్. "ఫాన్స్ కి చెప్పాలి కదా" అన్నాడు నవ్వుతూ తేజ.

"దేవి నవరాత్రులు అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి " అని తేజా అడిగాడు. "ఉదయాన్నే చిత్రాన్నం తినేసి పిండి వంటలు తినేసి ఫ్రెండ్స్ తో మ్యాట్నీ సినిమాకు వెళ్లి సాయంత్రం అమ్మ నేను అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి  తినేసి పడుకోవడం " అన్నాడు అమరదీప్.   "నీకు డాన్స్ ల్లో ఎవరు ఇన్స్పిరేషన్ " అని అడిగాడు తేజ. "హీరోస్ లో రవి తేజ డాన్స్ ఇస్తాం అలాగే బేసిక్ గా చిరంజీవి గారి డాన్స్ అంటే ఇష్టం. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, అలాగే అల్లు అర్జున్ డాన్స్ అన్నా ఇష్టం. ఎవరి డాన్స్ తక్కువ అని చెప్పలేము  ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళది. " అన్నాడు అమరదీప్.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com