Immanuel Foul Game: ఇమ్మాన్యుయేల్ ఫౌల్ గేమ్.. పాపం సంజనకి అన్యాయం!
on Dec 3, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో మొదటి ఫైనలిస్ట్ కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటగా బుద్ధిబలం ఉన్న టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. అందులో రీతూ, పవన్ కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్ పాల్గొన్నారు. ఇమ్మాన్యుయేల్ గెలిచి చదరంగంలోని తన పక్కనున్న రెండు గడులని సొంతం చేసుకొని తన గడిని విస్తరించుకున్నాడు.
తర్వాతి టాస్క్ నువ్వు ఎవరితో ఆడాలని అనుకుంటన్నావని ఇమ్మాన్యుయేల్ ని బిగ్ బాస్ అడుగగా సంజన పేరుని చెప్పాడు ఇమ్మాన్యుయేల్. ఇక సంజన, ఇమ్మాన్యుయేల్ కి 'పంతం నీదా నాదా' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా సీసాకి ఉన్న తాడుని లాగి అవతలి వైపు ఉన్న బాక్స్ పైకి వచ్చేలా చేయాలి ఆ తర్వాత చుట్టూ ఉన్న బాల్స్‌ని తీసుకొని అవతలి వైపు ఉన్న బాక్స్‌లోకి విసరాలి. ఇలా టాస్క్ ముగిసే సమయానికి ఎవరు తమ అవతలి వైపు ఉన్న బాక్స్‌లో ఎక్కువ బాల్స్ ఉండేలా చూసుకుంటారో వారు ఈ టాస్కులో గెలుస్తారని బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ టాస్క్ మధ్యలో రోప్‌ని వదలడానికి వీల్లేదంటూ బిగ్‌బాస్ రూల్ చెప్పాడు.
ఇక సంజన చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చింది. ఒకానొక స్టేజ్ లో సంజన గెలుస్తుందేమోనని అనుకున్నారంతా కానీ తను బాల్స్ తీసుకోనే టైమ్ లో రోప్ ని వదిలేసింది. అది చూసిన సంఛాలక్ మీరు రోప్ ని వదలేశారు.. అవుట్ అని చెప్పడంతో తను తప్పుకుంది. దాంతో ఇమ్మాన్యుయేల్ ని విజేతగా ప్రకటించారు సంఛాలక్. అయితే టైమ్ ఫ్రేమ్ 31.54 దగ్గర ఇమ్మాన్యుయేల్ తన చేతిలోని రోప్ ని వదిలేసి రెండు చేతుల్తో బాల్స్ తీసుకున్నాడు. ఇది సంఛాలక్ తో పాటు ఎవరు గమనించలేదు. దాంతో సంజనకి అన్యాయం జరిగింది. మరి వీకెండ్ లో నాగార్జున దీనిని బిగ్ టీవీలో చూపించి సంజనకి న్యాయం చేస్తాడా లేక లైట్ తీస్కుంటాడా చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



