Home

»

Tv News

బిగ్ బాస్ కి వెళ్లాలంటే ఇన్ని టెస్టులు చేయించుకోవాలా.!

Oct 8, 2026 2:15PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఇప్పుడు మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ టైములో గత సీజన్స్ లో వెళ్లిన కంటెస్టెంట్స్ కొందరు బిగ్ బాస్ నుంచి కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా దివి కూడా ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది.
" బిగ్ బాస్ లో ఏమి అడిగి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు.. మీ హైట్, మీ గ్లామర్ చూసి సెలెక్ట్ చేశారా " అంటూ రాజా రవీంద్ర దివిని అడిగాడు. "నా ఫొటోస్ చూసి సెలెక్ట్ చేశారు. అలాగే మూడు నాలుగు ఇంటర్వ్యూస్  అయ్యాయి. వీళ్లంతా ఒకేసారి వీడియోలో మాట్లాడతారు. అలాగే ఒక డాక్టర్ కూడా  మాట్లాడతారు. మెంటల్ కండిషన్ ఎలా ఉందో  చూస్తారు. ఆ తర్వాత బాడీ టెస్టులు కూడా జరుగుతాయి. ఆ తర్వాత ఎంట్రీ దొరుకుతుంది. " అని చెప్పింది. "అంటే బీపీ, షుగర్ లు లాంటివి ఏమీ లేవు కదా అని చూస్తారా " అని హోస్ట్ అడిగేసరికి అన్ని టెస్టులు చేస్తారు అని చెప్పింది.

మెంటల్ టెస్ట్ కూడా జరుగుతుంది. హౌస్ లోకి వెళ్ళాకా ఎలా బిహేవ్ చేస్తారు స్టేబుల్ గానే ఉన్నారా అని డాక్టర్ చెక్ చేస్తారు. ఆ హాల్ లో డాక్టర్ మాత్రమే ఉంటారు. మిగతా టైములో మిగతా వాళ్లంతా ఉంటారు. మా టీవీ నుంచి ఎండోమాల్ నుంచి కొంతమంది ఉంటారు. నేను బిగ్ బాస్ కి వెళ్లే టైంకి నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానన్నమాట. "బిగ్ బాస్ లో ఎవరిని చూసి భయమేసింది " అని అడిగేసరికి "ఎవరికీ భయపడలేదు. నాగ్ సర్ అంటేనే కొంచెం భయం వేసేది. " అని చెప్పింది. "బిగ్ బాస్ లో నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ సైట్ కొట్టిన వాళ్ళు కానీ లేరా" అని అడిగేసరికి. "అలా ఏమీ లేదు. బిగ్ బాస్ ఫాస్ట్ ఫాస్ట్ గా ఐపోయింది. ఆ టైంకి నాకు ఎక్కడి నుంచో ఒక ఎనెర్జీ వచ్చింది. ఎవరికి భయపడలేదు. నేను సరదాగా తీసుకున్నాను  గేమ్ ని. తర్వాత అనిపించింది సీరియస్ గా తీసుకుని ఉంటే బాగుండేది అని" అనిపించింది అంటూ చెప్పింది దివి.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com