Home

»

Tv News

టెంప్టేషన్ అండ్ టెన్షన్స్ వీక్‌లో నాగార్జున ప్లాన్ ..సిగ్మా టీమ్ సందడి!

Sep 27, 2026 12:39PM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో టెంప్టేషన్ అండ్ టెన్షన్స్ వీక్ నడుస్తోంది. ఈ వీక్ లో భాగంగా శుక్రవారం ఏం జరిగిందో నాగార్జున చూపించాడు. కెప్టెన్ గా ముఖేష్ చేస్తున్న ఓవర్ యాక్షన్, మిథిలేష్ ని జిమ్ ట్రైనర్ అని ముఖేష్ అన్నట్టుగా రోహిత్, షాలినీ చెప్పడం జరిగింది. అపూర్వ అయితే శ్రిష్టి గురించి షాలినీ చేసిన బ్యాక్ బిచ్చింగ్ గురించి సుధీర్ అండ్ టీంతో చెప్పింది.  ఇంటిని చూస్తే చిరాకు అనిపిస్తోందని అన్నా, అది అమన్ ని ఉద్దేశించి కాదు అని రోహిత్ కి త్రిగుణ్ వివరించాడు.

లవ్ స్టోరీస్ టాపిక్ లో ఇంట్లో ఫుల్ నవ్వులు పూయించారు. రెండేళ్ల కంటే ఎక్కువ రిలేషన్ లో ఉండను.. నాకు బోర్ కొడుతుందని దేబ్జానీ చెప్పింది. తన లవర్ ఇంటికి వెళ్లి చిక్కుకుపోయానని, బాత్రూంలోని పై ఏరియాలో ఆరు గంటలు ఉండిపోయానని చెప్పి నవ్వించాడు ముఖేష్. ఇలా ఫన్ టాపిక్స్ తర్వాత నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. త్రిగుణ్ కి నాగార్జున ఒక సలహా ఇచ్చాడు. నువ్వు ఏదైనా మొహం మీదే చెప్తావ్ కదా.. ఈ సారి ఝాన్సీ, అమన్, ముఖేష్ విషయంలో ఎందుకు చేయలేదని అడిగాడు.

శనివారం ఎపిసోడ్ లో సిగ్మా ప్రమోషన్స్ 2 లో భాగంగా సంజయ్, సందీప్ కిషన్ హౌస్ లోకి వచ్చారు. ట్రైలర్ ప్లే చేసి చూపించారు. త్రిగుణ్, సందీప్ కిషన్ మాట్లాడుకున్నారు. అంతా త్రిగనదూత నడుస్తోందని త్రిగుణ్ తో సందీప్ కిషన్ అనడంతో అందరూ నవ్వారు. ఇక షాలినీ సేఫ్ అయినట్టుగా నాగార్జున చెప్పాడు. షాలినీ పేరెంట్స్ ఫోటోని పంపించడంతో షాలినీ ఎమోషనల్ అయింది. సుధీర్ సేఫ్ అయినట్టు కూడా నాగార్జున అనౌన్స్ చేశాడు.ముఖేష్, రోహిత్ ఆడిన ఆటలో వీడియో చూపించి.. ఎల్లో లైన్ క్రాస్ అయిందని, సంఛాలక్ గా అమన్ తీసుకున్న నిర్ణయమే రైట్ అని నాగార్జున చెప్పాడు. రామ్ ప్రసాద్ ఏ ఉద్దేశంతో చేసినా కరెక్ట్ గానే చెప్పాడని అన్నాడు. చివరకు బ్రీఫ్ కేస్ ఆఫర్ తో ఎపిసోడ్ ని హైలైట్ చేశాడు నాగార్జున.

 

 

[Bigg Boss Temptation Week Telugu, Bigg Boss 10 Saturday Highlights]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com