Home

»

Tv News

ఈ బిగ్ బాస్ సీజన్ మరీ ఓవర్ గా అనిపిస్తోంది... పిలుపొచ్చినా నే వెళ్ళను

Oct 9, 2026 6:13PM

బుల్లితెర మీద భానుశ్రీ అంటే చాలు తన వాయిస్ తో అందరినీ ఆకట్టుకునే అమ్మాయిగా సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్ 2 లో హౌస్ లోకి వెళ్లి గేమ్ బాగా ఆడింది. అలాగే సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్. ఇక మూవీస్ లో వచ్చిన ఆఫర్స్ తో అప్పుడప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా అఖిల్ సార్థక్ సెలూన్ యానివర్సరీ సెలెబ్రేషన్స్ కి వచ్చింది.  అక్కడ ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి చాలా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ బిగ్ బాస్ సీజన్ అస్సలు తనకు నచ్చలేదని చెప్పేసింది.

"ప్రెజెంట్ బిగ్ బాస్ చూస్తున్నాను. కానీ అప్పటి బిగ్ బాస్ లే బాగున్నాయనిపిస్తోంది. ఇప్పుడు చాలా ఓవర్ గొడవలు ఐపోతున్నాయి. అప్పుడు చిన్న గొడవైతే వాళ్ళు ఎలిమినేట్ ఐపోయేవాళ్లు. అందరికీ కొంచెం భయముండేది. ఇప్పుడు ఎవరికీ భయం లేదు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. నువ్వెంత  అంటూ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేస్తున్నారు. ఈ సీజన్ మరీ ఓవర్ గా వెళ్లిపోతున్నారు. మానవత్వం అనేది ఒకటి ఉంటుంది కదా. ఎంత ఫైట్ కైనా కూడా బోర్డర్ ఉంటుంది. చాలా సీజన్స్ లో చూస్తే గొడవలు పడినా హద్దు దాటేవాళ్ళు కాదు. బయటకు ఈ విషయం ఎలా వెళ్తుందో అని భయపడేవాళ్లు. ఇప్పుడు ఏంటంటే ఎలా ఐనా వెళ్లనీ మనం ఇందులో ఉన్నాం కదా. మనం తోపు గాళ్ళం ఆడాల్సిందే అని  ఆడుతున్నారు.  ఈ సీజన్ ఎందుకో మరీ ఓవర్ గా ఆడుతున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు నాకు బిగ్ బాస్ నుంచి పిలుపొచ్చినా నేను వెళ్ళను ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉన్నా. " అని చెప్పింది భానుశ్రీ.

బుల్లితెర మీద ఆమె జాబిలమ్మ, వాణి-రాణి లాంటి సీరియల్స్ లో నటించింది అలాగే గోల్డ్ రష్ , టాలీవుడ్ స్క్వేర్స్ లాంటి షోస్ లో కనిపించింది. ఇక మూవీస్ విషయానికి వస్తే బాహుబలి, కుమారి 21 ఎఫ్, కాటమరాయుడు వంటి వాటిల్లో నటించింది.  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com