బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఫుల్ సీరియస్ గా కనిపించాడు. శుక్రవారం ఎపిసోడ్ లో జరిగిన గొడవలను వీడియోలతో సహా చూపించాడు. కెప్టెన్ గా ముఖేష్ చేస్తున్న ఓవర్ యాక్షన్ పై నాగార్జున ఫైర్ అయ్యాడు. మిథిలేష్ ని జిమ్ ట్రైనర్ అని అనడం ఏంటని ముఖేష్ ని నిలదీశాడు. వర్షిణి పొగడటం వల్ల జెలసీ వచ్చిందా అని ప్రశ్నించాడు. ఇంట్లో బిచ్చింగ్ స్టార్ గా షాలినీని టార్గెట్ చేశాడు నాగార్జున.
శ్రిష్టి గురించి రోహిత్ దగ్గర షాలినీ బ్యాక్ బిచ్చింగ్ చేయడాన్ని నాగార్జున తప్పుబట్టాడు. అపూర్వ చెప్పిందే నిజమైంది కదా.. ఏదైనా మొహం మీద చెప్పాలని షాలినీకి కౌంటర్ వేశాడు. అలాగే అమన్ ని బచ్చా గాడు అనడం కరెక్ట్ కాదని హెచ్చరించాడు. మరోవైపు నరేష్ ని మాత్రం నాగ్ ఆకాశానికి ఎత్తేశాడు. నీ క్యారెక్టర్ గోల్డ్, నువ్వు ప్లాటినం అని పొగిడాడు. నువ్వు నా దృష్టిలోనే కాదు ఆడియన్స్ దృష్టిలో కూడా ఎవరెస్ట్ అని ప్రశంసించాడు.
దేబ్జానీని కూడా నాగార్జున వదిలిపెట్టలేదు. చిల్లర మాటలు వద్దు.. నిన్ను నవ్వించే వాళ్లని ఏడ్పించేలా చేస్తున్నావని సీరియస్ అయ్యాడు. నరేష్ ఎంత బాధపడ్డాడో వీడియో ప్లే చేసి చూపించాడు. దేబ్జానీ సారీ చెప్పడంతో వదిలేశాడు. రామ్ ప్రసాద్ కి కూడా నాగార్జున సలహా ఇచ్చాడు. కన్నింగ్ అన్నందుకు ఫీల్ అవ్వకు.. రకరకాల మనుషులకు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి.. నువ్వు నీ ఆట ఆడుకోమని నాగార్జున చెప్పాడు. ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఆట కూడా ముఖ్యమేనని గుర్తుచేశాడు.
వంశీ, ఝాన్సీ, చరణ్ లకు కూడా నాగార్జున క్లాస్ ఇచ్చాడు. వంశీ అరవడం కాదు.. ఆటలు కూడా ఆడాలని అన్నాడు. ఝాన్సీ బాగా ఆడావ్.. కెప్టెన్ గా పని చేశావ్ కానీ పనుల్ని సకాలంలో పూర్తి చేయించాలని చెప్పాడు. చరణ్ నువ్వేదో పొడుస్తావని చూస్తున్నాం.. ఏం చేయడం లేదని అన్నాడు. రోహిత్ మధ్యలోకి ఎందుకు దూరుతున్నావ్.. ఏదైనా మొహం మీద చెప్పమని సలహా ఇచ్చాడు. మొత్తంగా శనివారం ఎపిసోడ్ ఫుల్ ఎమోషనల్, ఫైర్ తో సాగింది.
[Bigg Boss Telugu Saturday Episode, Nagarjuna Fires On Mukesh Shalini, Bigg Boss 10 Weekend Review, Naresh Everest Comment Nag]
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కంటెస్టెంట్స్ పై నాగార్జున ఫైర్.. దేబ్జానీ, షాలినీకి క్లాస్!
Sep 27, 2026 12:26PM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




