Home

»

Tv News

అమన్ వర్సెస్ రోహిత్.. కెప్టెన్ ముఖేష్ ఓవర్ యాక్షన్ కి నాగార్జున చెక్!

Sep 27, 2026 1:00PM

బిగ్ బాస్ తెలుగు-10 లో వీకెండ్ లో మరో సైలెంట్ వార్ బయటపడింది. శుక్రవారం నాటి ఎపిసోడ్ లో జరిగిన చిన్నచిన్న గొడవలను నాగార్జున శనివారం స్టేజ్ మీద వేశాడు. అందులో మెయిన్ గా అమన్, రోహిత్ మధ్య జరిగిన ఇష్యూ హైలైట్ అయింది. ఇంటిని చూస్తే చిరాకుగా ఉందని త్రిగుణ్ అనడం.. అది అమన్ ని ఉద్దేశించి అన్నాడని రోహిత్ ఫీల్ అవ్వడం జరిగింది. దీనిపై త్రిగుణ్ క్లారిటీ ఇచ్చాడు. అది అమన్ ని ఉద్దేశించి కాదని రోహిత్ కి వివరించాడు. అయినా రోహిత్ మధ్యలో దూరడం కరెక్ట్ కాదని నాగార్జున హెచ్చరించాడు.

కెప్టెన్ గా ముఖేష్ వ్యవహరిస్తున్న తీరుపై నాగార్జున సీరియస్ అయ్యాడు. ముఖేష్ కెప్టెన్ అయ్యాక ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని హౌస్ మేట్స్ కంప్లైంట్ చేశారు. ముఖేష్, రోహిత్ ఆడిన టాస్క్ లో ఎల్లో లైన్ క్రాస్ అయిందని వీడియోతో సహా చూపించాడు నాగార్జున సంఛాలక్ గా అమన్ తీసుకున్న నిర్ణయమే రైట్ అని తేల్చి చెప్పాడు. రామ్ ప్రసాద్ చెప్పింది కూడా కరెక్టే అని అన్నాడు. కెప్టెన్ అంటే రూల్స్ ఫాలో అవ్వాలి కానీ రూల్స్ బ్రేక్ చేయకూడదని ముఖేష్ కి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు.

కొత్తగా వచ్చిన అపూర్వ, మిథిలేష్ లతో పాత కంటెస్టెంట్లకు ఇష్యూలు మొదలయ్యాయి. మిథిలేష్ ని జిమ్ ట్రైనర్ గా మాత్రమే పనికొస్తాడని ముఖేష్ అన్న మాటను రోహిత్, షాలినీ బయటపెట్టారు. దీనిపై నాగార్జున ముఖేష్ ని నిలదీశాడు. వర్షిణి మిథిలేష్ ని పొగడటం వల్ల నీకు జెలసీ వచ్చిందా అని అడిగాడు. దీనికి ముఖేష్ లేదు సర్, ఎవరు ఫిట్ గా ఉన్నా వర్షిణి పొగుడుతుంది అని కవర్ చేశాడు. అలాగే అమన్ ని బచ్చా గాడు అనడం కూడా తప్పేనని చెప్పాడు నాగార్జున .

అపూర్వ వచ్చిన రెండు రోజుల్లోనే హౌస్ లో బ్యాక్ బిచ్చింగ్ ని బయటపెట్టింది. శ్రిష్టి గురించి షాలినీ చేసిన బ్యాక్ బిచ్చింగ్ ని సుధీర్ టీమ్ తో చెప్పింది. దీంతో షాలినీ బిచ్చింగ్ స్టార్ అని ముద్ర పడింది. నాగార్జున కూడా షాలినీకి స్ట్రాంగ్ కౌంటర్ వేశాడు. అలాగే త్రిగుణ్ కూడా మొహం మీద చెప్పే మనిషి, కానీ ఝాన్సీ, అమన్ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నావని ప్రశ్నించాడు. కొత్త వాళ్ల రాకతో పాత వాళ్ల గేమ్ మొత్తం డిస్టబ్ అయిందని నాగార్జున అన్నాడు.

 

 

[Bigg Boss Telugu Aman Rohit Fight, Mukesh Captain Over Action, Bigg Boss New Contestants Apoorva Mithilesh Issue, Bigg Boss 10 Weekend Shock]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com