Home

»

Tv News

పవర్‌తో ఆటని మార్చేసిన వర్షిణి.. గెలిచింది అమన్‌.. కెప్టెన్ గా వర్షిణి!

Oct 3, 2026 10:39AM

బిగ్ బాస్ సీజన్-10 నాలుగో వారం కెప్టెన్సీ కోసం రెడ్ టీం నుంచి ఐదుగురే కంటెండర్లుగా ఉండాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో రెడ్ టీం డిస్కషన్ మొదలైంది. డ్యాగర్స్ ఉన్నవాళ్లు కెప్టెన్సీ కంటెండర్లుగా ఉండాలా.. లేక డ్యాగర్స్ వేరే వాళ్లకు ఇచ్చి కంటెండర్లు కావాలా అని చర్చించుకున్నారు. కొందరు డ్యాగర్స్ కాపాడుకునే ప్రయత్నం చేయగా, ఇంకొందరు కెప్టెన్సీ కోసం డ్యాగర్స్‌ను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ క్రమంలో రోహిత్ తన టీంకు హితబోధ చేస్తూ అమన్ తొందరగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాడని కామెంట్ చేశాడు.

ఇక సుధీర్, వర్షిణి, ముఖేష్ చెప్పిన డీల్‌కు అమన్ ఒప్పుకున్నాడు. రెండు డ్యాగర్స్ ఇస్తే కెప్టెన్సీ కంటెండర్ ప్లేస్ ఇస్తామని చెప్పడంతో అమన్ వెంటనే ఓకే అన్నాడు. కానీ రోహిత్, షాలినీ, అపూర్వ అందరు అమన్‌ను బ్రెయిన్ వాష్ చేశారు. కనీసం ఒక్క డ్యాగర్ అయినా ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో అమన్ మళ్లీ వెళ్లి "క్లిష్ట పరిస్థితుల్లో ఒక డ్యాగర్ ఇస్తారా?" అని సుధీర్, ముఖేష్‌తో బేరమాడాడు. సుధీర్ మాత్రం "ఆలోచిస్తా, కన్సిడర్ చేస్తా" అని మాత్రమే చెప్పాడు.

ఫైనల్‌గా వర్షిణి, ఝాన్సీ, రామ్ ప్రసాద్, అపూర్వ, అమన్ ఐదుగురు కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొన్నారు. ఇది మూడు దశల్లో జరిగింది, సంఛాలకులుగా షాలినీ, సుధీర్ వ్యవహరించాడు. మొదటి రౌండ్‌లో అపూర్వ, వర్షిణి ఔట్ అయ్యారు, రెండో రౌండ్‌లో రామ్ ప్రసాద్ వెళ్లిపోయాడు. చివరి రౌండ్‌లో అమన్, ఝాన్సీ తలపడగా మెరుపు వేగంతో టాస్క్ పూర్తి చేసి అమన్ గెలిచాడు. అమన్ కెప్టెన్ అని అందరు ఫిక్స్ అయ్యారు.

కానీ చివరి నిమిషంలో వర్షిణి.. నా పవర్ వాడతానని బిగ్ బాస్‌కు చెప్పింది. గ్రాబ్ ఎనీ విన్ పవర్‌తో అమన్ కెప్టెన్సీని లాక్కుంది. ఈ వారం నాకు చాలా ముఖ్యం అందుకే తీసుకుంటున్నా, సారీ అమన్ అని వర్షిణి చెప్పింది. అంత కష్టపడి సాధించుకున్నాది పోయిందని డిస్స్పాయింట్ అవుతాడు అమన్..


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com