Home

»

Tv News

జాక్ పాట్ కొట్టిన సుధీర్, వంశీ.. నేరుగా 6వ వారంలోకి!

Oct 3, 2026 10:37AM

హౌస్ లో కెప్టెన్సీ డ్రామా ముగిసిన వెంటనే మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. డ్యాగర్స్ ఉన్నవాళ్లే ఇమ్యూనిటీ ఛాలెంజ్‌లో పాల్గొంటారని బిగ్ బాస్ ప్రకటించాడు. అప్పటికి సుధీర్ వద్ద 5, శ్రిష్టి వద్ద 3, వంశీ వద్ద 6 డ్యాగర్స్ ఉన్నాయి. ఒక డ్యాగర్ ఉంటే ఛాలెంజ్‌లో ఉండొచ్చు, రెండు డ్యాగర్స్ ఉంటే ఎవరికి ఇమ్యూనిటీ ఇవ్వాలో డిసైడ్ చేసే పవర్ ఉంటుందని బిగ్ బాస్ రూల్ చెప్పాడు.

దీంతో హౌస్ లో మరోసారి రిక్వెస్ట్‌ల పర్వం మొదలైంది. రోహిత్, షాలినీ, అమన్ అందరూ.. ఒక్క డ్యాగర్ ఇవ్వండి అని అడుగుతూ తిరిగారు. చివరకు లెక్కలు మారిపోయాయి. సుధీర్ వద్ద 3, శ్రిష్టి వద్ద 2, వంశీ వద్ద 5, అమన్, రోహిత్ వద్ద ఒక్కో డ్యాగర్ మిగిలింది. అందరూ ఇమ్యూనిటీ కోసం గట్టిగా పోటీ పడ్డారు. ఇమ్యూనిటీ టాస్క్‌లో మొదట శ్రిష్టి తెలివిగా వంశీ ఫోటో తీసేసి తన ఫోటో పెట్టుకుంది. తనకే ఇమ్యూనిటీ రావాలని ప్రయత్నించింది. కానీ సుధీర్ వెంటనే వచ్చి శ్రిష్టి ఫోటో తీసేసి మళ్లీ వంశీకి ఇమ్యూనిటీ ఇచ్చాడు. ఇక ఝాన్సీ త్రిగుణ్‌కు ఇమ్యూనిటీ వద్దని, వంశీ చరణ్‌కు వద్దని చెప్పడంతో ఫైనల్‌గా వంశీ, సుధీర్‌లకు ఇమ్యూనిటీ దక్కింది. దీంతో వారిద్దరూ నేరుగా ఆరో వారంలోకి వెళ్లిపోయారు. అంటే ఐదో వారంలో వారికి నామినేషన్ భయం లేదు. బిగ్ బాస్ కూడా అధికారికంగా.. వంశీ, సుధీర్ ఆరో వారంలోకి వెళ్తున్నారని ప్రకటించాడు. ఈ వార్త వినగానే త్రిగుణ్, ముఖేష్ గ్యాంగ్ ఫుల్ ఖుషీ అయ్యారు, సంబరాలు చేసుకున్నారు.

 

మరోవైపు డ్యాగర్స్ కోసం కెప్టెన్సీని వదులుకుని చివరకు ఒక్క డ్యాగర్‌తో మిగిలిన అమన్ పరిస్థితి దారుణంగా మారింది. ఇమ్యూనిటీ కూడా రాకపోవడంతో అతనికి నష్టమే మిగిలింది. ఈ ట్విస్ట్‌తో బిగ్ బాస్ ఆట మరింత రసవత్తరంగా మారింది.

 

 

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com