.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 ఏడో వారంలో డబుల్ ఎలిమినేషన్‌లో బయటకు వచ్చిన దక్షి, బయటకు రాగానే సెన్సేషనల్ కామెంట్స్‌తో షాక్ ఇస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న వారిలో ఎవరు విజేత అవుతారని ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడగగా, దక్షి ఏ మాత్రం తడబడకుండా, ఆలోచించకుండా డెఫినెట్లీ త్రిగుణ్ అని సమాధానమిచ్చింది. రోహిత్ కంటే త్రిగుణ్ చాలా బెటర్ అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హౌస్‌లో రెండు వారాలు మాత్రమే ఉన్న దక్షి ఇలా విన్నర్‌ను డైరెక్ట్‌గా ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది.తన కామెంట్స్‌కు కారణాన్ని కూడా దక్షి స్వయంగా వివరించింది. నేను హౌస్‌లోపలికి వెళ్లే ముందు త్రిగుణ్ మీద ఒక నెగెటివ్ ఫీలింగ్‌తో, రోహిత్ మీద ఒక పాజిటివ్ ఫీలింగ్‌తో వెళ్లానని ఆమె చెప్పింది. కానీ లోపలికి వెళ్లాక తన అంచనా తప్పని తేలిందని అంది. త్రిగుణ్ ఏదైనా గొడవ జరిగిన తర్వాత వెళ్లి దాన్ని సాల్వ్ చేసుకుంటాడని, అతనిలో ఆ మెచ్యూరిటీ ఉందని దక్షి మెచ్చుకుంది. కానీ రోహిత్ అలా కాదు, ల్యాగ్ ఉన్నాడని, చాలా విషయాల్లో వెనకబడి ఉన్నాడని ఘాటుగా విమర్శించింది. అందుకే బిగ్ బాస్ సీజన్ 10 విజేత త్రిగుణ్ కన్ఫర్మ్ అని ఆమె ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పింది.
దక్షి చేసిన ఈ కామెంట్స్‌తో రోహిత్, త్రిగుణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్‌యే మొదలైంది. రోహిత్ ఫ్యాన్స్ దక్షి కామెంట్స్‌ను తప్పుబడుతుంటే, త్రిగుణ్ ఫ్యాన్స్ మాత్రం దక్షి చెప్పింది నిజమేనని సపోర్ట్ చేస్తున్నారు. హౌస్‌లో రోహిత్, త్రిగుణ్ మధ్య మొదటి నుంచి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గేమ్‌లో ఇద్దరూ ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి సమయంలో హౌస్‌లో ఇద్దరితోనూ కలిసి ఉన్న దక్షి ఇచ్చిన రివ్యూకు ప్రాధాన్యత ఉందని చాలా మంది అంటున్నారు. లోపల ఏం జరుగుతుందో బయట ఆడియన్స్‌కు పూర్తిగా తెలియదు, లోపల ఉన్న దక్షికి అసలు క్యారెక్టర్స్ తెలుసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఐదో వారంలో వైల్డ్ కార్డ్‌గా వచ్చి, ఏడో వారంలో తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయిన దక్షి, ఉన్న రెండు వారాల్లో పెద్దగా ఆడలేకపోయినా, బయటకు వచ్చాక తన మాటలతో వార్తల్లో నిలుస్తోంది.




.webp)
