Home

»

Tv News

Bigg Boss Telugu 10: అపూర్వ ఎంట్రీతో షాలినికి జెలసీ.. హౌస్ మేట్స్ లో టెన్షన్!

Sep 26, 2026 11:37AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి వైల్డ్ కార్డ్ గా అపూర్వ ఎంట్రీ ఇచ్చింది. తను అలా ఎంట్రీ ఇవ్వగానే హౌస్ లో కంటెస్టెంట్స్ మైండ్ సెట్ ఒక్కసారిగా మారిపోయింది.  అపూర్వ హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే షాలిని సడెన్ గా చాలా జెలస్ గా ఫీల్ అయింది. ఈ విషయాన్ని అమన్ కూడా నోటీస్ చేసి.. ఏంటి.. ఎందుకు అంత యాంగ్రీగా ఉన్నావని షాలినిని అడిగాడు. దానికి ఆమె సైలెంట్ గా ఉంది. హౌస్ మేట్స్ రియాక్షన్ మొత్తానికి మెయిన్ రీజన్ అపూర్వనే.‌

అయితే ఇది కేవలం షాలిని మాత్రమే కాదని, నరేష్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు. వర్షిణి కూడా అపూర్వని చూసి కొంచెం స్కేర్డ్ గా ఉన్నట్లు అనిపిస్తోందని నరేష్ అన్నాడు. అతని ప్రకారం అపూర్వకి చాలా స్ట్రాంగ్ డిఫెండింగ్ స్కిల్స్ ఉన్నాయట. ఎవరైనా తనని క్వశ్చన్ చేస్తే తన పాయింట్ ని చాలా కాన్ఫిడెంట్ గా ఎక్స్ ప్లెయిన్ చేయగలదని, తన పొజిషన్ ని డిఫెండ్ చేసుకోవడం కూడా అపూర్వకి బాగా తెలుసని నరేష్ అభిప్రాయపడ్డాడు. అపూర్వని చూసిన తర్వాత హౌస్ మేట్స్ ఆమెని ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నారో ఆడియన్స్ కి కూడా అర్థమైంది. అపూర్వ రాకతో హౌస్ లో ఉన్న కొందరికి తమ గేమ్ కి చెక్ పడుతుందేమోననే భయం మొదలైందని క్లియర్ గా తెలుస్తోంది. ముఖ్యంగా శాలిని, వర్షిణి లాంటి స్ట్రాంగ్ ఫీమేల్ కంటెస్టెంట్లకు అపూర్వ గట్టి పోటీ ఇవ్వబోతుందని అర్థమవుతోంది.

మొత్తానికి ఇక ముందు అపూర్వ వర్సెస్ హౌస్ మేట్స్  ఆర్గుమెంట్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఎందుకంటే ఆమెకి స్ట్రాంగ్ డిఫెండింగ్ స్కిల్స్ ఉన్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో ముఖేష్ గౌడని అసలు మాట్లాడనీయకుండా చేసింది. ఇక హౌస్ లో తన ఆటతీరు ఇంకా ఎలా ఉంటుందో చూడాలి మరి. వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన అపూర్వ ముందు ముందు హౌస్ లో ఎలాంటి రచ్చ చేస్తుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 


[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Apoorva, Bigg Boss Wild Card, Shalini, Varshini, Aman, Naresh, Mukesh Gowda, Wild Card Entry]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com