Home

»

Tv News

నామినేషన్స్ గురించి మాట్లాడిన షాలిని, రోహిత్, అమన్‌కి నో కెప్టెన్సీ.!

Oct 18, 2026 12:37PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆరోవారం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇచ్చాడు బిగ్ బాస్ .  నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున వచ్చి రాగానే  కంటెస్టెంట్స్‌తో ఒక ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా షాలిని , రోహిత్, అమన్ ల కి వీడియో లు ప్లే చేసి మరి గట్టిగా క్లాస్ పీకాడు నాగార్జున .

నిన్నటి ఎపిసోడ్ లో  షాలినికి నాగ్ కన్ఫెషన్ గదిలోకి పిలిచాడు. నీతూ, రోహిత్ మాట్లాడుకున్న వీడియోని  షాలినికి చూపించాడు . దాంతో  నమ్మినందుకు నాదే తప్పు సర్ అని షాలిని అంటుంది. నేను నిన్ను నమ్మాను కానీ నాగ్ అంటే సర్ నేను నామినేషన్లు గురించి మాట్లాడలేదు. అమన్ మాట్లాడితే కట్ చేశానని అంటుంది. దానికి నాగ్ సరే అయితే ఇంట్లోకి రా  అని పిలిచి అమన్‌ని కూడా లేపి నామినేషన్స్ గురించి మాట్లాడొద్దని షాలిని చెప్పినా ఎందుకు మాట్లాడావ్.. హౌస్ మొత్తానికి ఎన్ని సార్లు చెప్పానని రోహిత్, అమన్ నామినేషన్ల గురించి మాట్లాడిన మాటలు వీడియో చూపిస్తారు. మరో వీడియోలో షాలిని, అమన్, రోహిత్ నామినేషన్ల గురించి మాట్లాడిన వీడియో చూపించి ఏంటి షాలిని నాతో ఆపాను అని చెప్పావ్.. ఎంత క్లియర్‌గా చెప్పినా ఎందుకు మానలేదని షాలిని ఫొటో పగలగొడతారు. బిగ్  బాస్‌ ఎన్నిసార్లు చెప్పినా అదే రిపీట్ చేస్తావా.. గతవారం అదే చెప్పావ్. ఇప్పుడు నా ముందే అబద్ధం చెప్పావ్.. ఎన్ని సార్లు చెప్పినా వినలేదు.. రోహిత్, అమన్, షాలినికి ఈ వారం కెప్టెన్సీ రేసులో ఉండరని అంటారు.

నామినేషన్లలో షాలిని, నీతూ గొడవ వీడియో చూపించి నీతూ టచ్ చేస్తే మెంటల్ అని నువ్వు చెప్పడం కరెక్టేనా అని అడుగుతారు. రోహిత్‌ని అడిగితే షాలినీదే తప్పు అని అంటాడు. కొందరు ఇంట్లోకి వస్తే మనకి కావాల్సిన వాళ్లు మారిపోయారు అని గేమ్ పాడుచేసుకుంటావా.. నీతూ కాళ్లు మొక్కుతావా.. అని అడిగితే నాకేం ప్రాబ్లమ్ లేదు సార్ అని అంటుంది. నీకు ఉందమ్మా కానీ మొక్కించుకునే వాళ్లకి ఉండాలి కదా అని రోహిత్ షాలినితో కాళ్లు మొక్కించుకున్న విషయం గుర్తు చేస్తారు.
 

 

 

[Bigg Boss Telugu 10 Weekend Episode, Nagarjuna Class to Shalini Rohith Aman, Shalini Photo Break, Bigg Boss 10 Nomination Talk Punishment]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com