బిగ్ బాస్ తెలుగు 10 వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున క్లాస్ మరింత హీట్ పెంచింది. ముందుగా అమన్, ముఖేష్ ల గొడవను నాగ్ తీశాడు. అమన్ కావాలనే నీయమ్మా అన్నావ్, అది నిజమా అని నాగ్ అడిగితే ఎంత చెప్పినా వినడం లేదు సార్ అందుకే అలా అన్నాను అని అమన్ ఒప్పుకున్నాడు.ఆ తర్వాత అమన్, రోహిత్ ల కుర్చీల గొడవ గురించి మాట్లాడారు. షాలిని అమన్తో డీల్ పెట్టుకున్నావ్ కదా మరి త్రిగుణ్ని అన్నావ్ కదా అని నాగ్ అడిగితే, టీంలో వాళ్లు నీకు అమన్ క్లోజ్ కదా వెళ్లి మాట్లాడు అని చెప్పారు సార్ అని షాలిని సమాధానం ఇచ్చింది. బ్రేక్ టైంలో అమన్, షాలిని మధ్య గొడవ జరిగింది. ఈ రోజు నుంచి నువ్వు నాకు మనిషివి కాదు అని అమన్ అంటే, నీకు ఈ రోజు పోతే నాకు ఆ రోజే పోయింది అని షాలిని కౌంటర్ ఇచ్చింది.
ఇక రాంప్రసాద్ - రోహిత్ విషయంలో త్రిగుణ్ చెప్పాడు అంటూ రాంప్రసాద్ నువ్వు శివ్తో డీల్ పెట్టుకున్నావ్ అనడంతో రోహిత్ శివ్ని పిలిచి లేదు అని చెప్పించాడు. ఆ మనిషి చెప్పేవన్నీ అబద్ధాలే అన్నా, ఇన్ని కెమెరాలు ఉన్నాయి కదా ఆ మాటలు ఎక్కడికి పోతాయ్ అన్నా, నాకు ఏడుపొస్తుంది అంటూ రోహిత్ బోరున ఏడ్చేశాడు. రోహిత్ బ్రేక్లో నీ బాధేంటి అంటే నా ఇమేజ్, నా రేంజ్ అని అందరూ ఏం అనుకుంటున్నారో అని అన్నాడు. దానికి నాగ్ నీ ఆట గురించి మాట్లాడుకుందామా, తన ఆట గురించి మాట్లాడి తనకి స్పేస్ ఇద్దామా, మనందరం తన ఆట గురించే మాట్లాడుకోవడమే తన గేమ్ ప్లాన్, అతను నీ మైండ్ని లాగేసుకున్నాడు, అదే అతని ప్లాన్ అని రోహిత్ కి అర్థమయ్యేలా చెప్పాడు. మీరు తప్పుగా అనుకుంటారని నా బాధ సార్ అంటే నేనేం అనుకోను, ఏమైనా అనుకుంటే డైరెక్ట్గా అడుగుతా అని నాగ్ భరోసా ఇచ్చాడు. రోహిత్ దొబ్బి తినేస్తున్నారు అన్న వివాదంపై వీడియో చూపించి ఎవరి తప్పు అని అడిగితే చేయి కూడా అమన్ని చూపించారు సార్, రోహిత్ తప్పు అన్నట్లు ఉంది అని రాంప్రసాద్, నరేశ్ లు అన్నారు. దానికి నాగ్ రోహిత్ తప్పు చేసినా ఎవరూ తప్పు చేసినట్లు అనుకోకూడదు కదా, రాంప్రసాద్ కూడా పనిష్మెంట్ వద్దు అంటున్నాడు చూడు అని అన్నాడు. పనిష్మెంట్ ఇస్తా సార్ అని రాంప్రసాద్ అనడంతో రోహిత్ ఎప్పుడూ క్లియరే, తను ఫుడ్ వేస్ట్ చేయొచ్చు కానీ ఇంట్లో ఎవరూ చేయకూడదు అంటూ నాగ్ సెటైర్ వేశాడు.అమన్ ఆట బాగుంది, నువ్వు గెలుపు గుర్రం, ఎవరు ఏం సలహాలు ఎందుకు ఇస్తున్నారో ఆలోచించమని అమన్ కి చెప్పాడు . ఆ తర్వాత త్రిగుణ్ తో మాట్లాడాడు నాగార్జున.నీ ఆలోచనా ధోరణి మార్చుకో త్రిగుణ్ , రొట్ట గ్యాంగ్ ఏంటి, ఎంత ఆవేశంలో అయినా నువ్వు మాటలు ఆపేస్తావ్ అనుకున్నా, నోరు కంట్రోల్ చేసుకో, ఇంట్లో పనులు చేస్తున్నావ్, అంతా బాగుందని అన్నాడు. వంశీ, శివ్ టాస్క్ లో నీ నిర్ణయం సూపర్ అని మెచ్చుకున్నాడు.
ఫుడ్ విషయంలో గొడవపై సుధీర్ని పిలిచి రోహిత్, త్రిగుణ్ గొడవలో ఎవరి తప్పు అంటే ముందు త్రిగుణ్దే అని, వీడియో చూపించాక త్రిగుణ్ తప్పు లేదని వర్షిణి, సుధీర్ లు చెప్పారు. త్రిగుణ్కి ఏం పనిష్మెంట్ ఇద్దామని రోహిత్ ని అడిగితే కిచెన్లోకి వెళ్లకూడదని అన్నాడు. చివరగా రోహిత్ నీ మైండ్ అంతా బాలేదు, కొంచెం క్లీన్ చేసుకో, మొదట నీ గేమ్ హిట్ అన్నా కానీ ఇప్పుడు బాలేదు అంటూ నాగ్ వార్నింగ్ ఇచ్చాడు .
[Bigg Boss Telugu 10 Weekend Episode Part 2, Aman Mukesh Fight, Rohith Crying Nagarjuna Advice, Bigg Boss 10 Telugu Latest Weekend Update]




