Home

»

Tv News

Bigg Boss 10 Telugu Week 8 Voting Results: టాప్ లో రోహిత్, వంశీ హోరాహోరీ.. లీస్ట్ లో వర్షిణి, డేంజర్ లో రామకృష్ణ!

Oct 31, 2026 10:50AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 ఎనిమిదవ వారం ఓటింగ్ లో రోహిత్, వంశీ మధ్య పోటీ నడుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అన్ అఫీషియల్ పోల్ ప్రకారం ఓటింగ్ లో ఊహించని ట్విస్ట్ లు కనిపిస్తున్నాయి.

ఈ వారం నామినేషన్స్ లో 8 మంది ఉండగా, అందులో రోహిత్ 29.95% (57,920 ఓట్లు)తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అతనికి పోటాపోటీగా వంశీ 29.89% (57,811 ఓట్లు)తో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. ఇద్దరి మధ్య కేవలం 109 ఓట్ల తేడా మాత్రమే ఉంది.ఇక మూడో స్థానంలో ఝాన్సీ 7.72% (14,923 ఓట్లు), నాలుగో స్థానంలో సుధీర్ 7.46% (14,421 ఓట్లు), ఐదో స్థానంలో శివ్ 7.26% (14,040 ఓట్లు) ఉన్నారు.ఇక డేంజర్ జోన్ విషయానికి వస్తే.. రామకృష్ణ 7.15% (13,820 ఓట్లు)తో ఆరో స్థానంలో, రామ్ ప్రసాద్ 6.63% (12,819 ఓట్లు)తో ఏడో స్థానంలో ఉన్నారు. అత్యంత తక్కువగా వర్షిణి 3.96% (7,663 ఓట్లు)తో లాస్ట్ లో ఉంది.

అయితే బీబీ హోటల్ టాస్క్ లో భాగంగా రామ్ ప్రసాద్ గ్రీన్ జోన్ కి వెళ్లి సేఫ్ అయ్యాడు. వర్షిణి స్టార్స్ ఎక్కువ సాధించి ఎల్లో జోన్ కి వెళ్లి ఆడియన్స్ ఓటింగ్ నుండి తప్పించుకుంది. దీంతో ఇప్పుడు లీస్ట్ లో ఉన్న రామకృష్ణ, శివ్ లలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది‌. ఇది అన్ అఫీషియల్ పోల్ మాత్రమే.. ఫైనల్ రిజల్ట్ కోసం వీకెండ్ ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com