ఓటింగ్ లో దుమ్ములేపుతున్న టెంపర్ వంశీ.. బాటమ్ లో వర్షిణి!

బిగ్ బాస్ తెలుగు 10 ఎనిమిదో వారం ఓటింగ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం మొత్తం ఎనిమిది మంది నామినేషన్ లో ఉండగా, అనధికారిక ఆన్ లైన్ పోల్ లో టెంపర్ వంశీ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. వంశీకి 28.82% ఓట్లతో (23,861 ఓట్లు) ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, రోహిత్ 25.87% (21,419 ఓట్లు) తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.
మిడిల్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి హోరాహోరీ పోటీ నడుస్తోంది. రామ్ ప్రసాద్ 8.48%, జాన్సీ 8.35%, సుధీర్ 8.31% తో దాదాపు సమాన ఓట్లతో ఉన్నారు. రామకృష్ణ 7.53% తో ఆ తర్వాత ఉన్నాడు. వీళ్ల మధ్య చిన్న ఓటింగ్ తేడా కూడా ఎలిమినేషన్ ని మార్చేస్తుంది.
ఇక బాటమ్ విషయానికి వస్తే, శివ్ 6.81% (5,641 ఓట్లు) తో ఏడో స్థానంలో, వర్షిణి కేవలం 5.83% (4,826 ఓట్లు) తో లాస్ట్ ప్లేస్ లో ఉంది. తన క్లోజ్ ఫ్రెండ్ త్రిగుణ్ నామినేట్ చేయడం వర్షిణికి సింపతీ తెస్తుందనుకున్నా, ఓటింగ్ లో మాత్రం అది వర్కవుట్ కావడం లేదు. ప్రస్తుత ఓటింగ్ ప్రకారం వర్షిణి డేంజర్ జోన్ లో ఉంది. ఈ లెక్కలు ఎప్పుడైనా మారొచ్చు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వీకెండ్ వరకు వేచి చూడాలి.




.webp)
.webp)
