Home

»

Tv News

Bigg Boss 10 Telugu 7th Week  Voting Results: టాప్ లో రోహిత్-త్రిగుణ్.. డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు!

Oct 22, 2026 9:46AM

బిగ్ బాస్ తెలుగు 10 ఏడో వారం ఓటింగ్ లో టాప్ జోన్ పూర్తిగా రోహిత్, త్రిగుణ్ లదే. హౌస్ లో ఒకరిపై ఒకరు పడి కొట్టుకుంటున్నా బయట మాత్రం వీరిద్దరికీ ఫ్యాన్ బేస్ పీక్స్ లో ఉంది. రోహిత్ 27.58% ఓట్లతో అంటే 22,918 ఓట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, త్రిగుణ్ 25.12% అంటే 20,875 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. వీరిద్దరూ కలిస్తేనే దాదాపు 52% ఓట్లు, అంటే సగం కంటే ఎక్కువ ఓటింగ్ వీరిద్దరికే పడింది. వీరి గొడవ వల్లనే సీజన్ కి హైప్ వచ్చిందని, అందుకే జనం వీరిని సేవ్ చేస్తున్నారని క్లియర్ గా తెలుస్తోంది. ఈ లెక్కన ఈ వారం వీరికి ఎలిమినేషన్ భయం అస్సలు లేదు.

మిడిల్ జోన్ లో రామకృష్ణ, అమన్, శ్వేత, సుధీర్, ఝాన్సీ ఉన్నారు. రామకృష్ణ 8.07% (6,706 votes) తో మూడో ప్లేస్ లో, అమన్ 8.03% (6,671 votes) తో నాలుగో ప్లేస్ లో ఉండి సేఫ్ జోన్ లో ఉన్నారు. శ్వేత 5.05% తో కాస్త పర్వాలేదు అనిపించుకుంటుంది. కానీ అసలు టెన్షన్ అంతా సుధీర్ 4.38%, ఝాన్సీ 4.15%, వంశీ 4.09%, వర్షిణి 4.03% లకే. వీరందరి మధ్య ఓట్ల తేడా కేవలం 100-200 ఓట్లు మాత్రమే. అంటే చిన్న పొరపాటు జరిగినా, ఒక్కసారిగా ఫ్యాన్స్ ఓట్లు తగ్గినా వీరు నేరుగా డేంజర్ జోన్ లోకి జారిపోయే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వర్షిణి, వంశీ లకు ఈ వారం గట్టి పోటీ తప్పదు.

ఈ వారం అసలు హార్ట్ బీట్ పెంచే జోన్ డేంజర్ జోన్. ఇందులో చివరి ముగ్గురు ఉన్నారు. ధక్షి 3.42% (2,845 votes) తో 10వ స్థానంలో, శివకుమార్ 3.11% (2,587 votes) తో 11వ స్థానంలో, నీతు 2.97% (2,468 votes) తో ఆఖరి స్థానంలో ఉంది. నీతు గత వారం నుంచి వర్షిణితో గొడవ, రూల్స్ పాటించకపోవడం వల్ల నెగిటివిటీ తెచ్చుకుంది. దానికి తోడు వైల్డ్ ఫైర్ గా వచ్చి ఫ్లవర్ లా ఉన్నావనే కామెంట్స్ ఆమెకు మైనస్ అయ్యాయి. శివకుమార్ కూడా గేమ్ లో పెద్దగా కనిపించకపోవడం వల్ల ఓట్లు పడటం లేదు. ఈ లెక్కన ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే ధక్షి కూడా డేంజర్ లోనే. ఓవరాల్ గా చూస్తే 7వ వారం నామినేషన్స్ లో 12 మంది ఉండటం వల్ల ఓట్లు చీలిపోయాయి. కానీ టాప్ 2 కి మాత్రం బల్క్ ఓటింగ్ వచ్చింది. డేంజర్ జోన్ లో ఉన్న నీతు, శివకుమార్ లకు ఈ వారం చివరి అవకాశమనే చెప్పాలి. సీక్రెట్ రూమ్ లో ఉన్న షాలినీ ఈ నామినేషన్స్, ఓటింగ్ అంతా చూస్తోంది కాబట్టి ఆమె తిరిగి హౌస్ లోకి వచ్చాక గేమ్ మొత్తం మారిపోయే ఛాన్స్ ఉంది. ప్రస్తుత పోల్స్ ప్రకారం నీతు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ 90% ఉంది. ఒకవేళ నాగార్జున డబుల్ ఎలిమినేషన్ అంటే శివకుమార్ కూడా బయటకు వెళ్లే అవకాశం ఉంది.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com