.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆరోవారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఓటింగ్ పోల్ షాకింగ్‌గా మారింది. వంశీ, అమన్, వర్షిణి, రోహిత్, షాలిని, రాంప్రసాద్ నామినేషన్స్‌లో ఉండగా లైవ్ ఓటింగ్‌లో భజన లాల్ గా ట్రోల్ అవుతున్న రోహిత్ టాప్‌లో దూసుకుపోతున్నాడు.లైవ్ పోల్ ప్రకారం రోహిత్ కి 23.71% ఓట్లతో 26,301 ఓట్లు వచ్చి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్‌లో రామ్ ప్రసాద్ 16.66% తో 18,483 ఓట్లు, థర్డ్ ప్లేస్‌లో షాలిని 15.16% తో 16,820 ఓట్లు సాధించారు. నాలుగో స్థానంలో అమన్ 15% తో 16,643 ఓట్లు, ఐదో స్థానంలో వంశీ 14.85% తో 16,478 ఓట్లు, చివరి స్థానంలో వర్షిణి 14.62% తో 16,220 ఓట్లతో డేంజర్ జోన్లో ఉంది.
ఈ ఓటింగ్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. గేమ్ ఆడటం లేదు, టాస్క్‌లలో ఎఫర్ట్ పెట్టడం లేదు, కేవలం షాలిని వెనుక భజన చేయడం తప్ప రోహిత్ ఏం ఆడుతున్నాడు.. అతనికి అంత భారీ ఓటింగ్ ఎలా వస్తుందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇదంతా పీఆర్ స్టంట్స్, అండ్ ఫేక్ ఓటింగ్ వల్లే సాధ్యమని నెటిజన్లు మండిపడుతున్నారు. హౌస్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లంతా వచ్చి రోహిత్ గేమ్ లేదు, రోహిత్ కోసమే షాలిని ఆడుతుంది, రోహిత్ రొట్ట గ్యాంగ్ అంటూ విమర్శలు చేస్తున్నా, బయట మాత్రం అతనికి ఓట్లు భారీగా పడటం హాట్ టాపిక్ అయింది.
మొత్తంగా ఆరోవారం ఓటింగ్ ఇంకా 1 రోజు 20 గంటలు మిగిలి ఉంది. ప్రస్తుతానికి వర్షిణి, వంశీ, అమన్ ముగ్గురూ బాటమ్ 3 లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది. గత వారం కూడా ఇలాగే ట్విస్ట్‌లు జరిగాయి. ఫైనల్ గా వీకెండ్లో నాగార్జున ఎవరిని సేవ్ చేస్తారో, ఎవరికి షాక్ ఇస్తారో చూడాలి. కానీ ప్రస్తుత లైవ్ ఓటింగ్ లెక్కల ప్రకారం భజన లాల్ అంటూ ట్రోల్ అవుతున్న రోహిత్ మాత్రం టాప్‌లో ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.






