
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆరోవారం ఫైనల్ ఓటింగ్ క్లోజ్ అయింది. ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఫైనల్ రిజల్ట్స్ లో రోహిత్ మొదటి స్థానంలో నిలిచాడు. రోహిత్ కి 21.25% తో 45,243 ఓట్లు వచ్చాయి.
రెండో స్థానంలో అమన్ 16.12% తో 34,316 ఓట్లు, మూడో స్థానంలో వంశీ 16.07% తో 34,200 ఓట్లు, నాలుగో స్థానంలో షాలిని 15.99% తో 34,048 ఓట్లు, ఐదో స్థానంలో రామ్ ప్రసాద్ 15.88% తో 33,807 ఓట్లు సాధించారు. చివరి స్థానంలో వర్షిణి 14.69% తో 31,265 ఓట్లతో ఉంది.
దీంతో ఈ వారం డేంజర్ జోన్ లో వర్షిణి ఉన్నట్లు క్లియర్ అవుతోంది. అయితే బాటమ్ 3 లో ఉన్న రామ్ ప్రసాద్, షాలిని, వర్షిణి మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంది. రామ్ ప్రసాద్ కి, వర్షిణికి మధ్య కేవలం 2,500 ఓట్ల తేడా మాత్రమే ఉంది. అధికారిక ఎలిమినేషన్ మాత్రం వీకెండ్ లో నాగార్జున అనౌన్స్ చేయనున్నారు. కానీ ఫైనల్ లైవ్ పోల్ ప్రకారం వర్షిణి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే రామ్ ప్రసాద్ కూడా డేంజర్ లో ఉండే అవకాశం ఉంది.




.webp)
