Home

»

Tv News

 అయిదో వారం ఓటింగ్ లో  ఎవరు టాప్, ఎవరు బాటమ్.!

Oct 9, 2026 9:54AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 ఐదో వారం నామినేషన్స్ లో 10 మంది ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ లో ఊహించని రిజల్ట్స్ వస్తున్నాయి. కామనర్స్ వర్సెస్ సెలెబ్రిటీ టీమ్ గా సాగుతున్న బిగ్ బాస్ సీజన్-10 అయిదో వారం వీకెండ్ కి వచ్చేసింది. ఇక కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ లు జరుగుతున్నాయి. ఈ వారం నామినేషన్లో ఉన్నవారిలో ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుంది.. ఎవరు టాప్ లో ఉన్నారు.. ఎవరు బాటమ్ లో ఉన్నారో  ఓసారి చూసేద్దాం.. 

తాజాగా ఓటింగ్ ప్రకారం.. రోహిత్ కి 24.67% (38,678 votes) ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత త్రిగుణ్ - 13.96% (21,888 votes) ఓట్లతో రెండవ స్థానంలో ఉండగా ముఖేశ్-11.74% (18,399 votes) ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత నరేశ్ - 7.44% (11,666 votes) ఓట్లతో నాల్గవ స్థానంలో ఉండగా ఝాన్సీ - 7.07% (11,085 votes) ఓట్లతో అయిదో స్థానంలో ఉంది. ఇక రామ్ ప్రసాద్ - 7.05% (11,052 votes) ఓట్లతో ఆరో స్థానంలో ఉండగా.. అపూర్వ- 7.04% (11,032 votes) ఓట్లతో ఏడో స్థానంలో ఉంది. చరణ్ - 7.03% (11,027 votes) ఓట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. షాలినీ - 7.03% (11,022 votes) ఓట్లతో తొమ్మిది,  అమన్ - 6.97% (10,934 votes) ఓట్లతో పదో స్థానంలో ఉన్నాడు.

ప్రస్తుతానికి రోహిత్ టాప్ లో దూసుకెళ్తున్నాడు. సుధీర్ తో గొడవ తర్వాత అతనికి సింపథీ వర్క్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇక డేంజర్ జోన్ లో అమన్, షాలినీ, చరణ్, అపూర్వ ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కామనర్స్ ప్లానింగ్ వీడియో వైరల్ అయ్యాక అమన్, షాలినీ, అపూర్వ, చరణ్ లకు నెగిటివిటీ పెరిగింది. అదే ఓటింగ్ లో కనిపిస్తోంది.ఇది అఫీషియల్ ఓటింగ్ కాదు.. ఆన్ లైన్ పోల్ మాత్రమే.  ఈ వారం అమన్, షాలినీలలో ఎవరో ఒకరు కన్ఫమ్ గా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనల్ రిజల్ట్ ఆదివారం ఎపిసోడ్ లో తెలుస్తుంది.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com