Home

»

Tv News

 ఈ వారం నామినేషన్ లో ఎవరెవరు ఉన్నారంటే.!

Oct 6, 2026 12:19PM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో నాలుగు వారాలు పూర్తయ్యాయి. నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ ఐదో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం బిగ్ బాస్ కాస్త డిఫరెంట్ గా గుమ్మడికాయ టాస్క్ ను తీసుకొచ్చాడు. ఒక కంటెస్టెంట్ గుమ్మడికాయను దాచిపెడితే, మరో ఇద్దరు కంటెస్టెంట్లు దాన్ని వెతకాలి. ఇందులో గెలిచిన వారికి ఇద్దరిని, ఓడిపోయిన వారికి ఒకరిని నామినేట్ చేసే అవకాశం కల్పించారు. ఈ టాస్క్ తో హౌస్ లో ఉత్కంఠ మొదలైంది.

ఈ వారం ఇమ్యూనిటీ టాస్క్ గెలవడంతో సుధీర్, వంశీలను నామినేట్ చేయకూడదని, అలాగే కెప్టెన్ అయిన వర్షిణిని కూడా నామినేట్ చేసేందుకు వీలు లేదని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు. తొలుత వర్షిణి గుమ్మడికాయను దాచిపెట్టగా, రామ్ ప్రసాద్, ముకేశ్ లు వెతకడానికి వెళ్లారు. ఇందులో రామ్ ప్రసాద్ విజేతగా నిలిచాడు. వెంటనే తనకు ఇచ్చిన రెండు నామినేషన్ల అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. గత వారం డాగర్ టాస్క్ లో జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ నామినేషన్స్ చేశాడు.

రామ్ ప్రసాద్ మొదటగా అమన్ ను నామినేట్ చేశాడు. త్రిగుణ్ మెడను పట్టుకోలేదని అన్నావు.‌ కానీ వీడియోలో పట్టుకున్నట్లు కనిపించిందని కారణం చెప్పాడు. ఆ తర్వాత త్రిగుణ్ ను నామినేట్ చేస్తూ, నువ్వు నా హీరోవి అయినప్పటికి రోహిత్ ను అలా అనడం నచ్చలేదని.. గేమ్ లో కోపం చూపించు కానీ బయట కాదని చెప్పాడు. దీంతో త్రిగుణ్ తను డిఫెండ్ చేసుకోనని రోహిత్ కు సారీ చెప్పగా రోహిత్ మాత్రం క్షమించనని చెప్పడంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఆ తర్వాత ఓడిపోయిన ముఖేశ్ అపూర్వను నామినేట్ చేశాడు. కెప్టెన్సీలో తన ప్రవర్తన నచ్చలేదని కారణం చెప్పడంతో అపూర్వ, ముఖేశ్ మధ్య గొడవ జరిగింది. రెండో రౌండ్ లో వంశీ గుమ్మడికాయ దాచిపెట్టగా అమన్, త్రిగుణ్ లు వెతికారు. త్రిగుణ్ గెలిచి అపూర్వ, అమన్ లను నామినేట్ చేశాడు. మూడో రౌండ్ లో నరేష్ దాచిపెట్టగా షాలినీ, వర్షిణి వెతికారు, వర్షిణి గెలిచి అపూర్వ, రోహిత్ లను నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లిస్ట్ లో అమన్, త్రిగుణ్, అపూర్వ, రోహిత్, ముఖేశ్ ఉన్నారు.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com