
బిగ్ బాస్ తెలుగు 10 నాలుగో వారం ఓటింగ్ లో త్రిగుణ్ టాప్ లో ఉండగా దేబ్జానీ, అమన్ లీస్ట్ లో ఉన్నారు. హౌస్ లో అమన్, ముఖేష్, రామ్ ప్రసాద్, త్రిగుణ్, రోహిత్, షాలినీ, శ్రిష్టి మినహా ఎవరు అంత యాక్టివ్ గా లేరు. దాంతో ఓటింగ్ అంతగా పడటం లేదు. రోహిత్ వర్సెస్ త్రిగుణ్ ఓటింగ్ సాగుతోంది. అయితే మెజారిటీ ఓటింగ్ త్రిగుణ్ కి పడుతోంది.
నాలుగో వారం ఓటింగ్ ఎలా ఉందో ఓసారి చూసేద్దాం..త్రిగుణ్ 55.58 శాతంతో 1,79,053 ఓట్లతో మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. త్రిగుణ్ దాదాపు అందరి ఓట్లు కలిపినా అంత రావడం లేదు. అమన్ తో ఫిజికల్ ఫైట్ తర్వాత వచ్చిన సింపతీ, ఫ్యాన్ బేస్ రెండు కలిసి వచ్చాయి. రెండో స్థానంలో రోహిత్ 13.1 శాతంతో 42,195 ఓట్లతో ఉన్నాడు. మూడో స్థానంలో ముఖేష్ 7.52 శాతంతో 24,235 ఓట్లతో సేఫ్ గా ఉన్నాడు.
నాలుగో స్థానంలో షాలిని 6.48 శాతంతో 20,861 ఓట్లతో ఉండగా, ఐదో స్థానంలో చరణ్ 5.99 శాతంతో 19,294 ఓట్లు తెచ్చుకున్నాడు. ఆరో స్థానంలో శ్రిష్టి 4.79 శాతంతో 15,431 ఓట్లతో ఉంది. ఏడో స్థానంలో నరేష్ 2.53 శాతంతో 8,158 ఓట్లతో ఉన్నాడు. ఇక డేంజర్ జోన్ లో అమన్, దేబ్జానీ ఉన్నారు. అమన్ 2.03 శాతంతో 6,527 ఓట్లతో ఎనిమిదో స్థానంలో, దేబ్జానీ 1.99 శాతంతో 6,396 ఓట్లతో తొమ్మిదో స్థానంలో అట్టడుగున ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ 99 శాతం ఉంది. అమన్ ఫిజికల్ అవ్వడం, దేబ్జానీ గేమ్ లో యాక్టివ్ గా లేకపోవడం వల్లే తక్కువ ఓట్లు వచ్చాయి.




.webp)

