Home

»

Tv News

Bigg Boss Telugu 10 Voting Week 3: ఓటింగ్ లో దూసుకుపోతున్న త్రిగుణ్.. డేంజర్ జోన్ లో ఝాన్సీ!

Sep 26, 2026 10:39AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 మూడో వారంలోకి అడుగుపెట్టింది. హౌస్ లో నామినేషన్స్, గొడవలు పీక్స్ కి చేరాయి. ఈ వారం నామినేషన్ లో 8 మంది కంటెస్టెంట్లు ఉండగా వారి ఓటింగ్ పర్సంటేజ్ కి సంబంధించిన లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. bigboss10teluguofficial ఇన్ స్టా పేజ్ షేర్ చేసిన Week 3 ఓటింగ్ రిపోర్ట్ ప్రకారం టాప్ లో త్రిగుణ్ దూసుకుపోతున్నాడు.

వైరల్ అవుతున్న ఓటింగ్ లిస్ట్ ప్రకారం త్రిగుణ్ 25.78% ఓట్లతో (22,565 votes) మొదటి స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత సుదీర్ 19.78% (17,319 votes) తో రెండో స్థానంలో, చరణ్ 11% (9,632 votes) తో మూడో స్థానంలో ఉన్నారు. అమన్ 10.3% (9,013 votes) తో, వర్షిణి 10.28% (9,004 votes) తో పోటాపోటీగా ఉన్నారు. వంశీ 9.85% (8,621 votes) తో ఆ తర్వాత స్థానంలో నిలిచాడు.

ఇక డేంజర్ జోన్ లో శాలిని 8.13% (7,115 votes) తో, ఝాన్సీ 4.88% (4,276 votes) తో అత్యల్ప ఓట్లతో చివరి స్థానంలో ఉంది. ఈ లెక్కన చూస్తే ఈ వారం ఎలిమినేషన్ కి ఝాన్సీకి ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రతీ సీజన్ లో ఇలాంటి అన్ అఫీషియల్ పోల్స్ దాదాపు అఫీషియల్ ఫలితాలకు దగ్గరగానే ఉంటున్నాయి. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ఆసక్తిగా మారింది. త్రిగుణ్ తన లీడ్ ని కంటిన్యూ చేస్తాడో లేదో తెలియాలంటే వీకెండ్ వరకు ఆగాల్సిందే

 

 

 

[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Bigg Boss Telugu Voting, Week 3 Voting, Trigun, Sudheer, Charan, Aman, Varshini, Jhansi]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com