
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో షాలిని, రామకృష్ణ మధ్య జరిగిన గొడవ వైరల్ గా మారింది. భజన్ లాల్ రోహిత్ గురించి తెలిసిందే కదా.. షాలినీ చుట్టూ తిరుగుతూ ఎవరు దొరుకుతారా వారిని ట్రిగ్గర్ చేసి స్క్రీన్ స్పేస్ పొందుదామా అని చూస్తుండగా పాపం రామకృష్ణ దొరికాడు. ఒక గొడవ జరుగుతుంటే మధ్యలో ఆపడానికి రామకృష్ణ అలా పక్కకి తోస్తే కావాలని మీద మీదకి వచ్చావంటూ భజన్ లాల్ రోహిత్ వచ్చేశాడు. అక్కడ చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారింది. అసలేం జరిగిందో చూసేద్దాం.
నిన్నటి ఎపిసోడ్ లో .. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా రామకృష్ణ షాలినిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఆమెని నెట్టాల్సి వచ్చింది. దీనితో రామకృష్ణ తనని గట్టిగా తోసేశాంటూ భజన్ లాల్ రోహిత్ కి చెప్పుకుని ఏడ్చేసింది షాలిని. దీనితో రామకృష్ణ కావాలని తాను నెట్టలేదని అనుకోకుండా జరిగిందని సారీ చెప్పాడు. అయినా షాలిని కూల్ కాకపోవడంతో ఆమె కాళ్ళు పట్టుకునేందుకు కూడా రెడీ అయ్యాడు. కానీ శివ కుమార్ వచ్చి సమస్యని సాల్వ్ చేశాడు.
మరో టాస్క్ లో కంటెస్టెంట్లను విక్టిమ్ కార్డ్, బ్యాక్ బిచింగ్ స్టార్, డ్రామా కింగ్ వంటి క్యారెక్టర్ల పేర్లతో పోల్చాల్సి వచ్చింది. అలా ప్రతీ క్యారెక్టర్ నేమ్ చెప్తూ దానిని వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎవరికి ఇచ్చారో గెస్ చేయడమే ఈ గేమ్. ఈ గేమ్ లో విక్టిమ్ కార్డ్ షాలినీ అని రామ్ ప్రసాద్ కరెక్ట్ గా గెస్ చేస్తాడు. దీనిపై శివ్ మాట్లాడుతూ నీతూకి, ఆమెకు జరిగిన దాంట్లో కూడా ఆమె అలానే చేశారు.. ఏదో దాడి చేసినట్టు, కొట్టినట్టుగా ఓవర్ చేశారు.. ఆమె క్యాజువల్ గానే టచ్ చేశారు.. కానీ ఆమె మాత్రం ఏదో పెద్దగా జరిగినట్టు చేసింది.. రామకృష్ణ విషయంలోనూ అలానే చేసింది.. ఆయన పుష్ చేశాడు కానీ.. దెబ్బ తగిలేట్టుగా పుష్ అయితే చేయలేదని నాకు అనిపించింది.. చివరకు ఆమె మాత్రం ఓవర్ చేసి.. రామకృష్ణ విసిగి ఆమె కాళ్లు పట్టుకునే వరకు తీసుకు వచ్చిందని శివ్ చెప్పాడు. నేను పట్టమని చెప్పానా? రామకృష్ణ.. నేను విక్టిమ్ కార్డ్ ప్లే చేశానా? అది చేసింది రామకృష్ణ అని షాలినీ నటన షురూ చేయగా.. భజన్ లాల్ రోహిత్ మధ్యలోకి వచ్చేస్తాడు. అది కాస్త పెద్ద గొడవగా మారింది.




.webp)
.webp)
