
బిగ్ బాస్ తెలుగు 10 లో వైల్డ్ కార్డ్ గా వచ్చిన నీతూ మాస్టర్ హౌస్ లో రోహిత్ కి ఒకటే ప్రశ్న అడిగింది. నీ గేమ్ నీకు నచ్చుతుందా.. ఫస్ట్ నుంచి ఆడినట్టే ఇప్పుడు కూడా ఆడుతున్నావా.. నువ్వు ఒక్కసారి ఆలోచించుకో.. ఎక్కడ నీ గేమ్ తగ్గుతుందో.. నాకు ఇప్పుడే ఆన్సర్ చెప్పక్కర్లేదు.. రేపు మార్నింగ్ ఆలోచించి చెప్పమంటూ స్ట్రాంగ్ క్వశ్చన్ వేసింది.
అంతే కాదు, సోలోగా ఉండు.. సోలోగా ఆడటానికి ట్రై చెయ్.. స్టార్టింగ్ లో ఎలా ఆడావో అలా ఆడమని నీతూ చెప్పింది. అలాగే పరోక్షంగా మా ఇంట్లో అందరూ బాగున్నారు.. నిన్ను మిస్ అవుతున్నారు.. అలానే బాధపడుతున్నారు కూడా అని కూడా చెప్పింది నీతూ. దీనికి భజన్ లాల్ రోహిత్.. ఎందుకు సోలోగా ఆడట్లేదా అని అడిగావని అంటాడు. అలా ఏం లేదు.. నువ్వు బాగా ఆడు.. మాకు కొన్ని రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి.. అన్నీ చెప్పకూడదు.. నువ్వు ఎమోషన్స్ పక్కన పెట్టి గేమ్ ఆడటానికి వచ్చావని గుర్తుపెట్టుకో.. ట్రై ని పెట్టి ఆలోచించు.. నువ్వు ఆలోచించగలవని నీతూ చెప్పింది.
నాకు నువ్వు ఇప్పుడు వీక్ గా అనిపిస్తున్నావ్.. నాకు స్ట్రాంగ్ ప్లేయర్ తో ఆడటమే ఇష్టం.. అందుకే నీకు చెప్తున్నా.. ఆలోచించు.. గేమ్ ఆడు.. అంటూ నీతూ మాస్టర్ క్లియర్ గా వార్నింగ్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు చాలా బాగా చెప్పారు నీతూ మాస్టర్.. క్లియర్ గా చెప్పారు.. భజన్ లాల్ రోహిత్ కి బల్బ్ వెలిగి, మళ్ళీ గేమ్ ఆడితే బాగుండు అంటూ కామెంట్లు పెడుతున్నారు. భజన గ్యాంగ్ నుంచి బయటకు వచ్చి భజన్ లాల్ అనే బిరుదు మర్చిపోయి రోహిత్ తన సోలో గేమ్ ఆడతాడా లేదా అనేది చూడాలి.





.webp)
