
అగ్నిపరీక్షలో ఒక్కొక్క కంటెస్టెంట్ సత్తా చాటుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.. 15 సెకన్ల బ్యాడ్జ్ వచ్చిన ఐదుగురికి లీడర్ అయ్యే ఛాన్స్ ఇస్తూ బిగ్ బాస్ వేగం టాస్క్ మొదలుపెట్టారు. భాగీ, రామకృష్ణ, హేమంత్, అపూర్వ, అమన్ లకు 70MM దోశ ఇచ్చి ఎవరు ముందుగా ఫినిష్ చేస్తే వాళ్లే ముందుగా టీంను ఫామ్ చేసుకోవచ్చని చెప్పారు. దీంతో భాగీ ఫస్ట్, ఆ తర్వాత హేమంత్, అమన్, చివరగా రామకృష్ణ, అపూర్వలు దోశను ఫినిష్ చేశారు.
అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. టాస్క్ టైం 15 నిమిషాలు అయినా.. మెడలో ఉన్న బ్యాడ్జ్ పై ఉన్న సెకన్లు మైనస్ అవుతాయని చెప్పారు. ముందుగా ఫినిష్ చేసిన భాగీ 60 సెకన్ల బ్యాడ్జ్ ఉన్న దీపక్, రోహిత్ లను తీసుకోవడంతో ఆ టీంకు 12 నిమిషాల 45 సెకన్లే మిగిలింది. చివరకు మిగిలిన అపూర్వ (15 సెకన్లు), రాజ్ కుమారి (30 సెకన్లు) ఒక టీం అయ్యారు. దీంతో వాళ్లకు 14 నిమిషాల 15 సెకన్లు అంటే అందరికంటే ఎక్కువ టైమ్ దొరికింది. దీపక్ తన ఫైర్ కార్డ్ వాడి స్ట్రాంగ్ టీం కావాలని హేమంత్, మిథిలేష్, చరణ్ లను భాగీ టీం నుండి తీసేశాడు. భాగీ అక్క కోసం, నా టీమ్ కోసమని చెప్పినా అది స్వార్థంగా మారింది. వేగం టాస్క్ లో పజిల్ ఫినిష్ చేయాల్సిన చోట దీపక్ ఆగిపోవడంతో భాగీ టీమ్ బొక్కబోర్లా పడింది.
అదే సమయంలో అపూర్వ, రాజకుమారి మెరుపు వేగంతో పజిల్ టాస్క్ ను పూర్తి చేసి అద్భుతం సృష్టించారు. అందరు తక్కువ అంచనా వేసిన టీమ్ గెలవడంతో జ్యూరీ సైతం లేచి నిలబడి క్లాప్స్ కొట్టింది. దీంతో అపూర్వకు ఓట్ అప్పీల్, రాజకుమారికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ స్టార్ తో ఓట్ అప్పీల్ దక్కగా ఓడిన భాగీకి ఎల్లో కార్డ్ తో డేంజర్ జోన్ కి వెళ్లింది.





.webp)
