Home

»

Tv News

Bigg Boss 10 Jhansi: హౌస్ లో బెస్ట్ కంటెస్టెంట్ ఝాన్సీ.. నాగార్జున ప్రశంసల వర్షం!

Oct 4, 2026 1:25PM

బిగ్ బాస్ సీజన్-10 నాలుగో వారం వీకెండ్ లో కంటెస్టెంట్స్ పై ఫైర్ అయ్యాడు నాగార్జున. త్రిగుణ్, రోహిత్, అమన్ లు తప్పులు చేశారు.. ఫౌల్ వర్డ్స్ వాడారంటూ వారికి ఎల్లో కార్డ్ ఇచ్చాడు నాగార్జున. ఆ తర్వాత దేబ్జానీ గేమ్ లో చేసిన చీటింగ్ ని బిగ్ స్క్రీన్ మీద చూపించారు. ఇంకా నరేష్ బాగా ఆడుతున్నాడని చెప్పాడు. ఇక రామ్ ప్రసాద్ ఎక్కువ సమయం పడుకునే ఉంటున్నాడంటూ వీడియో చూపించాడు.

ఇక హౌస్ లో ఈ వారం బాగా ఆడి ఇమ్మ్యూనిటీ గెలుచుకున్న సుధీర్, వంశీని స్పెషల్ గా అభినందించాడు నాగార్జున. ఇక చరణ్ ప్రెజెన్స్ లేదని చాలా తక్కువగా కనపడుతున్నాడని చెప్పాడు. ఇక హౌస్ లో ప్రతీ గేమ్ లో తన వంద శాతం ఎఫర్ట్స్ ని ఇస్తూ ఝాన్సీ బెస్ట్ కంటెస్టెంట్ గా నిలిచిందని చెప్పుకొచ్చాడు. "ప్రతీ సిచువేషన్ లోను వాళ్ళని కంట్రోల్ చేయడానికి నువ్వు ట్రై చేసిన తీరు ఈజ్ వెరీ వెరీ గుడ్ అమ్మా.. ఇదేంటంటే ప్రతీ క్షణం హౌస్ లో ఏదైనా గొడవ జరుగుతుంటే నువ్వు అక్కడ ఉండి సెన్సిబుల్ గా డీల్ చేస్తూ కంట్రోల్ చేస్తున్నావ్.. అందుకే నువ్వు ఆటలో బాగా ఆడగలుగుతున్నావ్.. గెలవగలుగుతున్నావ్.. ఝాన్సీ కీప్ ఇట్ అప్ అండ్ కీప్ గోయింగ్ అప్" అంటూ నాగార్జున మెచ్చుకున్నాడు. ది బెస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ ది వీక్ గా ఝాన్సీ కి నాగార్జున ఓటేశారు.

హౌస్ లో ఎవరికీ బయాజ్ గా ఉండకుండా తన గేమ్ తను ఆడుతూ ప్రతీ ఆటలో గెలుస్తోంది ఝాన్సీ. బిగ్ బాస్ సీజన్-10 మొదటి కెప్టెన్ గా గెలిచిన ఝాన్సీ.. నాలుగో వారంలోనూ తన ఆటతీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ కి దగ్గర అవుతోంది ఝాన్సి.

నిజానికి ఈ సీజన్ లో మొదటి నుంచి చాలా మంది కంటెస్టెంట్స్ గ్రూప్ గేమ్ ఆడుతూ, గొడవల్లోనే టైమ్ వేస్ట్ చేస్తున్నారు. కానీ సింగర్ ఝాన్సీ మాత్రం ఎవరి గ్రూప్ లోకి వెళ్లకుండా, సోలోగా తన వంద శాతం ఎఫర్ట్ పెడుతూ టాస్క్ లలో ఫిజికల్ గా, మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఆడుతోంది. ఫౌల్ గేమ్, చీటింగ్, బూతులు లాంటివి లేకుండా క్లీన్ గేమ్ ఆడుతూనే హౌస్ లో గొడవ జరిగిన ప్రతిసారీ పెద్ద మనిషిలా అడ్డుకుని సెన్సిబుల్ గా డీల్ చేయడం వల్లనే నాగార్జున దృష్టిలో ఆమె బెస్ట్ కంటెస్టెంట్ అయ్యింది. మొదటి కెప్టెన్ గా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు తన కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ, ఆడియన్స్ ఓటింగ్ లోనూ, హోస్ట్ ప్రశంసల్లోనూ టాప్ లో నిలవడంతో ఝాన్సీ ఈ సీజన్ టైటిల్ కి స్ట్రాంగ్ కంటెండర్ గా మారిందని నెటిజన్లు కూడా అంటున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com