
బిగ్ బాస్ సీజన్-10 లో ఏడో వారం ముగిసింది. నిన్నటి సండే ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. మొదటగా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం బాటమ్ లో ఉన్న దక్షి ఎలిమినేట్ అవ్వగా రెడ్ జోన్ లో ఉన్న షాలినిని గ్రీన్ జోన్ లో ఉన్నవాళ్ళు ఎలిమినేట్ చేశారు.
గోట్(G.O.A.T) కోసం ఏడో వారం టాస్క్ లు ఇచ్చిన బిగ్ బాస్. అందులో రెడ్, ఎల్లో , గ్రీన్ బాక్స్ లు ఉంచాడు. గ్రీన్ లో ఉన్నవాళ్ళు గోట్ అని చెప్పగా అయిదుగురు మాత్రం గ్రీన్ బాక్స్ లోకి వచ్చారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రెడ్ జోన్‌లో ఉన్న ఏడుగురిలోంచి ఎల్లో జోన్‌లో ఉన్న నలుగురు.. సేవ్ చేస్తారు. శివ్ శ్వేతని, రాం ప్రసాద్ ఝాన్సీని, వర్షిణి సుధీర్‌ని, నరేష్ వంశీని సేఫ్ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన రోహిత్, షాలినీ, ఆర్కేలకు గ్రీన్ జోన్‌లో ఉన్న ఐదుగురు ఎగ్జిట్ బ్యాడ్జ్ పెట్టాల్సి ఉంటుంది. అందులో నీతూ, దేబ్జానీ షాలినికీ బ్యాడ్జ్ పెడతారు. ముకేష్, అమన్ ఏమో ఆర్కేకి బ్యాడ్జ్ పెడతారు. చివరగా వచ్చిన త్రిగుణ్.. షాలినీకి బ్యాడ్జ్ పెడతాడు. అలా షాలినీ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అయితే అలా వచ్చే ముందు కూడా రోహిత్, షాలినీ రొమాన్స్ ఏ మాత్రం తగ్గలేదు. గేట్ చివరి వరకు వచ్చినా కూడా రోహిత్ మళ్లీ వెనక్కి పిలిచి హగ్ ఇస్తాడు. ఇక షాలినీ చెవిలో ఐ లవ్యూ అని చెప్తుంది.
ఇక స్టేజ్ మీదకి వచ్చిన షాలిని.. నాకు రోహిత్ విన్ అవ్వాలని ఉందని చెప్పింది. షాలినీ వెళ్తుంటే మళ్లీ నాగార్జున మళ్ళీ పిలుస్తాడు. ఏంటి? మళ్లీ పిలుస్తున్నాడంటూ రామ్ ప్రసాద్ షాక్ అవుతాడు. ఏంటి రామ్ ప్రసాద్ షాక్ అయ్యావా అని అడుగుతాడు. కాసేపటకి మైక్ కోసం షాలినీని నాగార్జున పిలుస్తాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తో ఎపిసోడ్ ముగిసింది.




.webp)
