
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 ఏడో వారంలో ఊహించని ట్విస్ట్ తో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ సీజన్‌లో మొదట ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దక్షి గుత్తికొండ ఎలిమినేట్ అయింది. ఆమె కేవలం రెండు వారాలు మాత్రమే హౌస్‌లో ఉండి, తన గేమ్‌తో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన మరో బిగ్ ట్విస్ట్ ఏంటంటే, ఇంటి సభ్యుల ఓటింగ్ ద్వారా రెడ్ జోన్‌లో ఉన్న షాలినిని కూడా బయటకు పంపించేశారు. గత వారం ఎలిమినేట్ కావాల్సిన షాలినిని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్‌కు పంపి ఒక అవకాశం ఇచ్చినా, ఆమె ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. దీంతో ఏడో వారంలో ఇద్దరు ఒకేసారి హౌస్‌ను వీడాల్సి వచ్చింది, ఇది మిగిలిన కంటెస్టెంట్స్ లో భయాన్ని పెంచింది.
షాలిని ఎలిమినేషన్ కు అసలు కారణం ఆమె ఆడిన లవ్ ట్రాక్ డ్రామాయే అని చెప్పవచ్చు. హౌస్‌లోకి కామనర్‌గా అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన షాలిని, మొదట్లో బాగానే ఆడినా, ఆ తర్వాత రోహిత్‌తో ప్రేమ వ్యవహారంలో పడి తన ఇండివిడ్యువల్ గేమ్‌ను పూర్తిగా పక్కన పెట్టేసింది. టాస్క్‌లలో యాక్టివ్‌గా లేకపోవడం, ఎప్పుడూ రోహిత్ చుట్టూనే తిరగడం, ఇతర కంటెస్టెంట్స్‌తో అనవసర గొడవలు పెట్టుకోవడం, ముఖ్యంగా తన ఆరోగెంట్ బిహేవియర్‌తో ఆమె ఆడియన్స్‌కు దూరమైంది. సీక్రెట్ రూమ్ నుంచి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా తన తప్పులను తెలుసుకుని గేమ్ మారుస్తుందని అందరు భావించారు.. కానీ వచ్చిన తర్వాత కూడా అదే వైఖరిని కొనసాగించడంతో నాగార్జున సైతం శనివారం ఎపిసోడ్‌లో ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చివరికి రెడ్ జోన్‌లోకి వెళ్లి హౌస్ మేట్స్ ఓటింగ్‌లో అత్యధిక వ్యతిరేక ఓట్లతో ఎలిమినేట్ అయింది.
ఇక అందరిని ఆశ్చర్యపరుస్తున్న విషయం షాలిని రెమ్యునరేషన్. బిగ్ బాస్ హౌస్‌లో సెలబ్రిటీలకు లక్షల్లో రెమ్యునరేషన్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. కానీ కామనర్‌గా వచ్చిన షాలినికి మాత్రం తక్కువే ఇచ్చారని సమాచారం. కొన్ని లీక్స్ ప్రకారం షాలిని, రోహిత్, అమన్, సృష్టి వంటి కామనర్స్‌కు వారానికి రూ. 70,000 చొప్పున ఇచ్చారని తెలుస్తోంది. అయితే షాలినికి వారానికి రూ. 75,000 ఒప్పందం ఉందని, అంటే 7 వారాలకు కలిపి ఆమె ఏకంగా రూ. 5.25 లక్షలు తీసుకుందంట. సెలబ్రిటీ కంటెస్టెంట్‌లు అయిన ఆటో రామ్ ప్రసాద్‌కు 3.5-4.5 లక్షలు, వర్షిణికి 3-3.75 లక్షలు ఇస్తున్నప్పుడు, కామనర్ అయిన షాలినికి ఇది మంచి అమౌంటే అని చెప్పాలి.మొత్తానికి ఏడో వారం జరిగిన ఈ డబుల్ ఎలిమినేషన్ బిగ్ బాస్ హౌస్‌లో మిగిలిన వారికి పెద్ద గుణపాఠంగా మారింది.






