Home

»

Tv News

Bigg Boss Telugu 10: మామయ్య అయ్యాడు రోహిత్ .. హౌస్ లో తెలియక టెన్షన్ పడ్డ కంటెస్టెంట్!

Sep 25, 2026 2:38PM

బిగ్ బాస్ తెలుగు 10 కంటెస్టెంట్ రోహిత్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. రోహిత్ మామయ్య అయ్యాడు, తన చెల్లికి పాపో బాబో పుట్టారని anchor_priyaramesh ఇన్ స్టా పేజ్ లో.. రోహిత్ మామయ్య అయ్యాడంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. లాంఛ్ రోజు స్టేజ్ మీద రోహిత్ త్వరలో మామయ్య అవుతున్నానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ ఫ్యామిలీలో జరిగిందని సోషల్ మీడియాలో టాక్‌.

అయితే ఈ విషయం ప్రస్తుతం హౌస్ లో ఉన్న రోహిత్ కి తెలియదు. మొన్న హౌస్ లో జరిగిన లెటర్ టాస్క్ లో రోహిత్ తనకు వచ్చే లెటర్ అమన్ టాస్క్ లో రాకుండా చేసాడు. ఆ లెటర్ లో ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉందేమో.. నా చెల్లి గురించి ఏమైనా ఉందేమోనని రోహిత్ లోలోపల చాలా టెన్షన్ పడ్డాడు.

ఇప్పుడు రోహిత్ చెల్లికి బిడ్డ పుట్టడంతో ఆ లెటర్ లో బహుశా ఇదే గుడ్ న్యూస్ ఉండి ఉంటుందేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. హౌస్ లో ఉన్నప్పుడు ఇలాంటి శుభవార్త మిస్ అవ్వడం బాధాకరమే అయినా రోహిత్ చేసిన త్యాగాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. బయటకు వచ్చాక ఈ విషయం తెలిస్తే రోహిత్ ఎంత ఎమోషనల్ అవుతాడోనని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఒకవైపు నడుస్తుంటే.. బయట ఫ్యామిలీలో ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ జరగడం ఫ్యాన్స్ కి కూడా సంతోషాన్ని ఇస్తోంది. రోహిత్ మామయ్య అయినందుకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు.

 

 

 

Bigg Boss Telugu 10 Rohit Becomes Mama, Bigg Boss 10 Telugu Rohit Sister Delivery, Rohit Sacrifice Letter Task Shalini, Bigg Boss Telugu 10 Latest News

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com