Home

»

Tv News

Bigg Boss Telugu 10: సీక్రెట్ రూమ్‌లోకి షాలిని..రోహిత్‌కి బిగ్ బాస్ ట్విస్ట్!

Oct 18, 2026 11:24AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో ఈ వారం ఊహించని మెగా ట్విస్ట్ చోటుచేసుకుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ భావించిన ఈ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్ అయిందని సమాచారం. ఎవరూ ఎలిమినేట్ కావడం లేదని, బదులుగా షాలినిని సీక్రెట్ రూమ్‌లోకి పంపించారని తెలుస్తోంది.

లేటెస్ట్ బజ్ ప్రకారం షాలిని సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లే ముందు రోహిత్‌కి ప్రపోజ్ చేసిందట. దీంతో రోహిత్ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా రోహిత్ - షాలిని లవ్ ట్రాక్ హౌస్‌లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రోహిత్ భజన గ్యాంగ్ అంటూ ట్రోల్ అవుతున్నా, షాలిని కోసం స్టాండ్ తీసుకుంటున్నాడు.

అయితే ఈ సీక్రెట్ రూమ్ ట్విస్ట్ తో గేమ్ మొత్తం మారిపోనుంది. సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిన షాలిని హౌస్‌లో ఏం జరుగుతుందో లైవ్‌లో చూసి, మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆమె రీ-ఎంట్రీతో హౌస్‌లోని ప్లాన్స్ అన్నీ బయటపడతాయని, ముఖ్యంగా తనను నామినేట్ చేసిన వారిపై షాలిని ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అధికారికంగా స్టార్ మా, జియో హాట్‌స్టార్ లో వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఈ ట్విస్ట్‌ని అనౌన్స్ చేయనున్నారు.

 

 

[Bigg Boss Telugu 10 No Elimination, Shalini Secret Room, Shalini Proposes Rohith, Bigg Boss 10 Telugu Secret Room Twist, Rohith Tears Viral]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com